Take a fresh look at your lifestyle.

తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ,కార్మిక నేత ,తెలంగాణ రాష్ట్ర తోలి హోమ్ మంత్రి నాయిని ఇక లేరు.

తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ,కార్మిక నేత ,తెలంగాణ రాష్ట్ర తోలి హోమ్ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి బుధవారం రాత్రి 12 గం .ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. సెప్టెంబర్ 28 న నాయిని కొరోనా సోకోడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఆ తరువాత నెగెటివ్ వొచ్చినా శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు నాయిని నరసింహారెడ్డి పార్థివ శరీరాన్ని అపోలో హాస్పిటల్  నుంచి మినిస్టర్ క్వార్టర్స్ కి తరలించారు.

రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ హాస్పిటల్ కి వెళ్లి నాయిని భౌతికకాయం వెంట ఉండి మినిస్టర్ క్వార్టర్స్ కి తరలించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో నర్సన్న కీలకపాత్ర పోషించా రన్నారు. కార్మిక నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాయిని నర్సింహా రెడ్డి మరణం కార్మిక లోకానికి కి తీరని లోటని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. బుధవారం రాత్రి రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయిని ని పరామర్శించారు .

Leave a Reply