Take a fresh look at your lifestyle.

భారత వ్యవసాయంలో టెక్నాలజీ ప్రాధాన్యం

“రైతులకు గరిష్ఠంగా మేలు జరిగేలా ప్రభుత్వం అగ్రి-బిజినెస్ ను ప్రోత్సహిస్తోంది. అమెజాన్, ఆలీబాబా, ఈ-బే, వాల్ మార్ట్ లాంటి ఈ-కామర్స్ వేదికలు కృత్రిమ మేధ , యాంత్రిక అభ్యసనం ద్వారా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. ఈ-కామర్స్ వేదికల విప్లవాత్మకత తరహాలోనే అగ్రి-బిజినెస్ పథకం సాయంతో ఈ-అగ్రి /డిజిటల్ అగ్రికల్చర్ కు రూపకల్పన జరుగుతోంది. ఇది ప్రధాన నగరాలు మొదలు పట్టణ ప్రాంతాలవరకూ చేరుతుంది. బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ లాంటి ఇంటికి చేర్చే ఏజెన్సీలు అగ్రి-బిజెనెస్ ను లాభదాయకంగా మార్చటానికి వ్యవసాయ నిపుణుల సాయం చేశారు. గ్రీన్ హౌస్ సేద్యం, పాలీహౌస్, కూరగాయల పెంపకానికి చిన్న పాటి జీవ వ్యవసాయ క్షేత్రాల వంటి వ్యవసాయ నూతన పరికల్పనలు రైతులకు లాభదాయకంగా మారాయి. నాణ్యత, సరసమైన ధరలు అందుకు దోహదం చేస్తున్నాయి.”

ప్రపంచంలో అతి పురాతన నాగరకతల్లో భారత నాగరకత ఒకటి. భారత వ్యవసాయమూ అంతే పురాతనమైనది. పురాతన భారత వ్యవసాయదారులు బాగా సంపన్నులై ఉండటానికి కారణం అది అప్పట్లో ఆత్యాధునికమైన, ప్రతిష్ఠాకరమైన వృత్తి కావటం. జనాభాలో యాభై శాతం ఇప్పటికీ వ్యవసాయం మీద, దాని అనుబంధ వృత్తుల మీదనే ఆధారపడి ఉంది. విదేశీ చొరబాటు దారులు, పాలకుల కారణంగా వ్యవసాయంతోబాటే భారత సంప్రదాయాలు, ఆచారాలు మతపరమైన సంస్కృతి దెబ్బతిన్నాయి. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే వ్యవసాయంలో మన ఆధునికత బాగా సైతం వెనకబడింది. స్వాతంత్ర్యం వచ్చాక మన రైతులు, వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసే మానవశక్తి అండతో మన దేశం ఆహార ధాన్యాలు, ప్రత్తి, చక్కెర, పాలు, మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులలో స్వావలంబన సాధించగలిగింది. ఈ రోజు భారతదేశం తృణధాన్యాలు, చక్కెర, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, గుడ్లు తదితరాల ప్రధాని ఉత్పత్తిదారుగా నిలిచింది. వరి, మాంసం, సముద్ర ఆహారోత్పత్తుల వాటా మన ఎగుమతులలో 52 శాతం ఆక్రమించుకున్నాయి. ప్రపంచంలోని నేలలో భారత్ వాటా 2.4 శాతమే అయినప్పటికీ, వ్యవసాయయోగ్యమైన భూమి మనకే ఎక్కువ ఉంది. అది మన ఆహార అవసరాలను తీర్చగలుగుతోంది. పైగా, మనం ఎగుమతుల ద్వారా ప్రపంచమంతా ఆహారధాన్యాలు సరఫరా చేయగలుగుతున్నాం.

రైతు అనుకూల మోదీ ప్రభుత్వం 2022 నాటికి ఎగుమతులను రెట్టింపు చేసే లక్ష్యంతో కొత్త ఎగుమతుల విధానాన్ని రూపొందించింది. ప్రభుత్వం ఎగుమతుల విలువను 3 వేల నుంచి 6 వేలకోట్ల అమెరికా డాలర్లకు పెంచాలని భావిస్తోంది. వ్యవసాయ సంబంధమైన సమస్యల పరిష్కారం కోసం ఒక విస్తృతమైన వ్యవసాయ విధానానికి చొరవ తీసుకోవటంతోబాటు ఈ విధానం కింద అనేక భారత రాయబార కార్యాలయాల్లో అగ్రి-సెల్స్ ఏర్పాటు చేసింది. నవ కల్పనల ద్వారా సరకు రవాణా రంగాన్ని, కొరియర్ సౌకర్యాలను మెరుగుపరచాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ కృషి ఫలితంగా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులు రూ. 2.73 లక్షల కోట్లకు పెరిగాయి. ఈరోజు భారతదేశం ప్రపంచదేశాలకు ఆహారం అందించగల స్థితిలో ఉంది. సానుకూల వాతావరణ పరిస్థితులు. సువిశాలమైన సాగు యోగ్యమైన భూమి, కష్టపడే రైతులు కచ్చితంగా మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అనుకూల కారకాలు.

భారత రైతులను ఇతర దేశాల రైతులతో ఇంకా మెరుగ్గా పోటీ పడేలా చేయటానికి వారికి తగిన అవకాశాలు కల్పిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అలవరచుకోవటం అందులో ముఖ్యమైనది. అయితే, ఈ విషయంలో ఇంకా అభివృద్ధి సాధించాల్సి ఉంది. అధిక దిగుబడినిచ్చే పంటలను అభివృద్ధి పరచే పరిశోధనలకు అధికప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం ఇది. పోల్చి చూసుకున్నప్పుడు మన జాతీయ సగటు ఉత్పత్తి చాలా తక్కువగా ఉండటం వలన దాన్ని పెంచుకోవాల్సిన అవసరముంది. ఉత్పత్తిలో మనం అంతర్జాతీయంగా పోటీపడాలంటే మన రైతు సోదరులు ప్రపంచదేశాలలో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి. ఎగుమతి సంబంధ కార్యకలాపాలలో ప్రైవేట్ పెట్టుబడిదారులు ముఖ్యమైన పాత్ర పోషించాలి. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నిర్మాణం జరగాలి. ఆహార ధాన్యాల నష్టాన్ని నివారించటానికి గోదాములు, శీతల గిడ్డంగులు, మార్కెట్ యార్డుల వంటివి నిర్మించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించటం ద్వారా విలువ జోడించే సేవలను మెరుగు పరచాలి. మన ఉత్పత్తుల నాణ్యత పెంచటం ద్వారా ఇతర దేశాలు మన ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునేట్టు చూడాల్సిన అవసరముంది. ఈ చర్యలతో అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇండియాకు గుర్తింపు సాధించగలుగుతాం.

ఎగుమతి సంబంధమైన సవాళ్ళను ఎదుర్కోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషి అవసరం. వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఆర్థిక పాకేజ్ రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. దీని సాయంతో రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశముంది. రైతులకు గరిష్ఠంగా మేలు జరిగేలా ప్రభుత్వం అగ్రి-బిజినెస్ ను ప్రోత్సహిస్తోంది. అమెజాన్, ఆలీబాబా, ఈ-బే, వాల్ మార్ట్ లాంటి ఈ-కామర్స్ వేదికలు కృత్రిమ మేధ , యాంత్రిక అభ్యసనం ద్వారా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. ఈ-కామర్స్ వేదికల విప్లవాత్మకత తరహాలోనే అగ్రి-బిజినెస్ పథకం సాయంతో ఈ-అగ్రి /డిజిటల్ అగ్రికల్చర్ కు రూపకల్పన జరుగుతోంది. ఇది ప్రధాన నగరాలు మొదలు పట్టణ ప్రాంతాలవరకూ చేరుతుంది. బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ లాంటి ఇంటికి చేర్చే ఏజెన్సీలు అగ్రి-బిజెనెస్ ను లాభదాయకంగా మార్చటానికి వ్యవసాయ నిపుణుల సాయం చేశారు. గ్రీన్ హౌస్ సేద్యం, పాలీహౌస్, కూరగాయల పెంపకానికి చిన్న పాటి జీవ వ్యవసాయ క్షేత్రాల వంటి వ్యవసాయ నూతన పరికల్పనలు రైతులకు లాభదాయకంగా మారాయి. నాణ్యత, సరసమైన ధరలు అందుకు దోహదం చేస్తున్నాయి.

ఇటీవలి కాలంలో సేంద్రియ వ్యవసాయం మహిళారైతులను కూడా బాగా ప్రభావితం చేస్తోంది. ఈరోజు రైతు కూడా అగ్రి బిజెనెస్ ను ఒక వ్యాపార ప్రణాళికగా రూపొందించుకొని స్టార్ట్ అప్ రూపంలో శాశ్వత ఆదాయ వనరుగా మార్చుకోగలుగుతున్నాడు. తన ఉత్పత్తులను బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటున్నాడు. అలోవేరా, వేప, తులసి లాంటి ఔషధ మొక్కలు పెద్ద ఎత్తున సాగుచేసి వైద్య, ఔషధ రంగాలకు అమ్మగలుగుతున్నాడు. రైతులు స్వేచ్ఛగా తమ ఉత్పత్తులను తమకు నచ్చిన విధంగా అమ్ముకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతోంది. వ్యవసాయ రంగంలోను, గ్రామీణాభివృద్ధిలోను రైతుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ కొత్త విధానాలను, ఆధునిక శాస్త్రీయ వ్యవసాయ విధానాలను వాడుకుంటూ వ్యవసాయంలో సంస్కరణల బాట పట్టేవారికి అండగా ఉంటోంది.

భారత్ వ్యవసాయ రంగాన్ని మార్చేసే కొన్ని ముఖ్యమైన ఆధునిక వ్యవసాయ మెలకువలు ఇవి:

  1. బయో టెక్నాలజీ – అత్యాధునిక వ్యవసాయ విధానాలు వాడుకుంటూ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట ఉత్పత్తి చేయగలిగే మెలకువ బయో టెక్నాలజీ లేదా జీవ సాంకేతిక పరిజ్ఞానం. ఇది పర్యావరణ అనుకూల విధానం కూడా. అందువలన ఈ పద్ధతులో మొక్కల, జీవుల వ్యర్థాలను వాడుకుంటూ ఆహారోత్పత్తిని పెంచగలిగే మెలకువ ఇది.
  2. నానో సైన్స్ – ఇది నానో సెన్సర్ల సాయంతో రైతులకు వేగంగా సమాచారం అందించే విధానం. మొక్కలకు నీరు తదితర అవసరాలు అన్నీ తగినంతగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని గ్రహించి రైతుకు తెలియజేస్తుంది. అంతే కాకుండా, ఉత్పత్తి చేసిన ఆహారపు నాణ్యతను కూడా ఇది తెలియజేస్తుంది.
  3. భౌగోళిక స్థితిగతులను తెలుసుకోవటం ద్వారా కూడా వ్యవసాయోత్పత్తిని కూడా పెద్ద ఎత్తున పెంచుకోవచ్చు. కలుపు, నేల నాణ్యత, భూసారం, తేమ శాతం, విత్తనాల పునరుత్పత్తి సామర్థ్యం, ఎరువుల అవసరం లాంటి అనేక అంశాల సమాచారం ఆధారంగా అధికోత్పత్తి సాధించవచ్చు.
  4. బిగ్ డేటా (సమగ్ర సమాచారం) సాయంతో వ్యవసాయం తెలివిగా చేయటానికి వీలవుతుంది. రైతు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. దీనివలన ముందస్తు అంచనాలు సులభమవుతాయి. ఇది వ్యవసాయ అభివృద్ధిని బలోపేతం చేస్తుంది.
  5. డ్రోన్లు: ఇవి ఉత్పత్తిని పెంచటంలోను, ఖర్చులు తగ్గించటంలోను, పర్యవేక్షణ ద్వారా నష్టాన్ని నివారించటంలోను డ్రోన్లు ఉపయోగపడతాయి. అత్యాధునిక సెన్సర్లు, డిజిటల్ చిత్రీకరణ సామర్థ్యం, భూసార విశ్లేషణ, పంటల మీద మందు చల్లటం, పంట పర్యవేక్షణ, ఫంగస్, ఇన్ఫెక్షన్ ల లాంటి పంటల ఆరోగ్య విశ్లేషణకు కూడా డ్రోన్ టెక్నాలజీ బాగా పనికొస్తుంది. వ్యవసాయ తదితర పనులకోసం డ్రోన్ల వాడకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. ఇటీవలే రాజస్థాన్ లో మిడతల దాడుల లాంటి సందర్భాలలో డ్రోన్ల అవసరాన్ని గ్రహించారు.

యావత్ ప్రపంచం ఎదుర్కుంటున్న కరోనా వైరస్ లాంటి సంక్షోభాన్ని సైతం ఒక అవకాశంగా మార్చుకొని వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చివేయవచ్చు. ఈ సంక్షోభ సమయంలో ఆహారోత్పత్తి తగినంతగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో అవసరాలకూ, ఉత్పత్తికీ మధ్య చాలా పెద్ద అంతరం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే జనం ఆహారాన్ని నిల్వ చేసుకోవటానికి పోటీ పడుతున్నారు. మనం భారతీయులం ఈ పరిస్థితిని ఒక అవకాశంగా మార్చుకొని మన రైతుల ఆర్థిక పరిపుష్టికి మార్గం సుగమం చేయవచ్చు. ఈ దిశలో అడుగేస్తే 2022 వరకు రైతులు తమ ఆదాయం దానంతట అదే రెట్టింపు అయ్యే అవకాశం పొందుతారు. ఆ విధంగా వ్యవసాయ రంగంలో భారత్ ఒక కీలకపాత్ర పోషించటం సాధ్యమవుతుంది. నేటి ప్రపంచమంతా శాస్త్ర సాంకేతికరంగం మయమే. కాలానికి అనుగుణంగా మనం మన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవటానికి కూడా టెక్నాలజీని తగినట్టు వాడుకోవాలి. ఆ విధంగా టెక్నాలజీ సాయంతో మన వ్యవసాయాభివృద్ధి లక్ష్యాలను ఆశించిన రీతిలో చేరుకోవచ్చు.

Kailash Chaudhary
కైలాశ్ చౌధరి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారత ప్రభుత్వం

Leave a Reply