Take a fresh look at your lifestyle.

కన్నీళ్లు అమ్మబడును

గోరుముద్దలు తినిపించిన చేతులు
లాలపోసి, బట్టలేసి, పౌడరద్దిన చేతులు
చెట్టంత కొడును సదివించిన చేతులు
చేతులు కావు .. మృత్యువును దాటి
మరుజన్మ ఎత్తిన .. మలినమంటని
మట్టిచేతులు
పుట్టి పుట్టగానే వీది తొట్టెలో
ఆసుపత్రి చెత్త లో విసిరివేయబడ్డ మాంసం ముద్ద..కుక్కల కొట్లాట
చీమల పోట్లాట
పందుల ఎదురుసూపులు..
వాడిన సిరంజీల బుజ్జగింపులు..
వెరసి ..ఆడబిడ్డ చిరునామా…
కట్నాలు రక్కసికి
కష్టాల గాలులకి గట్టిగా నిలబడ్డ
నిలువెత్తు మట్టిస్వేద
అకాలమృత్యువును హద్దుకున్నప్పుడు

గాలిని పీల్చడం మాని
మొద్దులా పాడేమీద పయణమైతున్న
కాలమనే కాంత ఏడిసినంతగా
పేగుబంధ•ంతో బంధుత్వం మున్నోల్లు
కన్నీళ్ళ బావులను వాడటంలో చాన దూరమున్నరు…..

ఇక్కడ కండ్లుమాత్రం గతం తాలూకు
జ్ఞాపకాలను వేతుకుతున్నవి..
కొన్ని పాదాలు అలసి కుర్చీలో కూలబడ్దవి
అప్పులిచ్చిన తలలు దిగాలుగా
ఇన్సూరెన్స్ ‌గాలులకై నలుదిక్కులు
వెతుకుతున్నవి…

టెంటు వృక్షం కింద అనేక
కన్నీరు కారని కండ్లే కనబడుతున్న
ఒకటో రెండో శిరస్సులు కన్నీటి సాగరాన్ని శ్రవిస్తున్నై ..

రాజకీయ పార్టీల మీటింగ్లకు
ర్యాలిలకు, ధర్నాలకు చాచిన చేతులు
వచ్చిన పైకం పోకెట్లోకి
రాత్రయితే మధ్యంలోకి మారి కడుపు నింపుకునే
ఆచారం..విశ్రుంకలమైన తిరుగుతున్న వేళ
బిరియాని పొట్లాలకు, బరంది సీసాలకు
అరువిచ్చే దేహాల…. ఇప్పుడు ఏది..
ఊరికే ఇవ్వరు …
ఇక్కడ కన్నిళకూడ. అమ్మబడును..

ఏమో?
కన్నపేగు కంటిముందు చితిలో
భస్మం మౌతున్న….
ఇంటిభారం మోసిన వెన్నెముక
వంగి.. బొందలో నిద్రిస్తున్న…
తోబుట్టువల దీపాలు కంటిముందే అరిపోతున్న
ఆపకపోగా…కనికరం కూడా అమ్ముకోవాల్సి రావచ్చు..
కన్నీళ్లకు మంచి గిరాకీ రానుంది…
ఇలపై కన్నీళ్లు అమ్మబడును, కొనబడును
నామపలకాలు తగికించే రోజు రానుంది….

– నాగరాజు మద్దెల
6301993211.

Leave a Reply