Take a fresh look at your lifestyle.

డిగ్రీస్థాయిలోనూ ఇంగ్లీష్‌ ‌మాధ్యమంలో బోధన

  • దశలవారిగా అమలు చేయడానికి కసరత్తు
  • ఊరూరా పటిష్టమైన ఇంటర్నెట్‌ అం‌దుబాటులోకి రావాలి
  • విద్యారంగంపై ఉన్నతస్థాయి సమీక్ష లో సిఎం జగన్‌ ఆదేశాలు

ఎన్ని విమర్శలు ఎదురైనా.. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ ‌మీడియం విద్యను ప్రారంభించిన ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం.. మరో కీలక ముందడుగు వేసింది. కాలేజీల్లోనూ ఇంగ్లీష్‌ ‌మీడియం ప్రవేశపెట్టడానికి పూనుకుంది. ఇంటర్‌, ‌డిగ్రీల్లోనూ ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగు, మెడికల్‌ ‌కాలేజీల్లానే ఇక నుంచి అన్ని డిగ్రీకాలేజీల్లో ఇంగ్లీష్‌ ‌వి•డియంలోనే బోధన ఉండాలని సీఎం సూచించారు.

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా దశల వారీగా అమలు చేయాలని ఆదేశించారు.. ముందు డిగ్రీ మొదటి ఏడాదిలో ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రారంభించాలని.. క్రమంగా మిగిలిన ఏడాదులకు విస్తరణ జరగాలన్నారు.. ఇక, ఇంటర్మీడియట్‌లో కూడా ఇదే విధానం అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. విద్యార్థులకు ప్రాథమికంగా ఇబ్బందులు లేకుండా పాఠ్యపుస్తకాలన్నీ ఇంగ్లీష్‌, ‌తెలుగు మాధ్యమాల్లో ముద్రించాలని.. దీని వల్ల రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు.. ఇక, స్కూల్‌ ‌స్థాయిలో ఇంగ్లీష్‌ ‌వి•డియం ఉండటంతో కాలేజీల్లో పెద్దగా ఇబ్బందులు లేకపోగా.. విద్యార్థులకు ఇంగ్లీష్‌ ‌వి•డియం ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం క్యాంప్‌ ‌కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై సవి•క్ష నిర్వహించారు.

ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ సతీష్‌ ‌చంద్ర,
ఆంధప్రదేశ్‌ ‌హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌మానిటరింగ్‌ ‌కమిషన్‌ ‌ఛైర్‌ ‌పర్సన్‌ ‌జస్టిస్‌ ‌వి ఈశ్వరయ్య, ఆంధప్రదేశ్‌ ‌స్టేట్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ‌ఛైర్మన్‌ ‌కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కోవిడ్‌ ‌తర్వాత కాలేజీల ప్రారంభం, క్లాసులు నిర్వహణపై అధికారులను ఆరాతీశారు. ఏపీ ప్రైవేటు యూనివర్శిటీ యాక్ట్ -2006‌ను సవరించడంపై చర్చించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా చట్టానికి సవరణలను ప్రతిపాదించారు. తొలిసారిగా ప్రైవేటు యూనివర్శి టీలు పెట్టేవారికి.. ఇప్పుడున్న కాలేజీలను ప్రైవేటు యూనివర్శిటీలుగా మార్చాలంటే కూడా అత్యుత్తమ ప్రమాణాలను నిర్దేశించాలని ఆదేశించారు.

ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యా సంస్ధలతో జాయింట్‌ ‌సర్టిఫికేషన్‌ ఉం‌డాలని, ఐదేళ్లకాలం పాటు ఇది కొనసాగాలని అన్నారు. ఈ కైట్రీరియాను అందుకున్న పక్షంలోనే ప్రైవేటు యూనివర్శిటీగా వారికి అనుమతి ఇవ్వడానికి తగిన అర్హతగా పరిగణించాలని చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ ప్రైవేటు యూనివర్శిటీ యాక్ట్ -2006‌కు సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. బీఎ, బీకాం లాంటి కోర్సులు చేసి.. ఇంగ్లీషులో మాట్లాడలేకపోతే పోటీ ప్రపంచంలో రాణించడం కష్టం అవుతుంది. ఉద్యోగావకాశాలను కల్పించే పాఠ్యప్రణాళికను తయారుచేయాలి. బీకాం చదివిన వారికి ప్రాథమిక ఆర్థిక కార్యకలాపాలపైన, స్టాక్‌ ‌మార్కెట్‌వంటి వాటిపైన అవగాహన కల్పించాలి. దీనివల్ల స్వయం ఉపాధికి ఆస్కారం ఏర్పడుతుంది.

ఆన్‌లైన్‌లో మంచి కోర్సులు ఉన్నాయి. అందులో మంచి అంశాలను పాఠ్యప్రణాళికలోకి తీసుకురావాలన్నారు. ప్రతి గ్రామానికి అన్‌లిమిటెడ్‌ ఇం‌టర్నెట్‌ను తీసుకు వస్తున్నాం. దీంతోపాటు అమ్మ ఒడి, వసతి దీవెన పథకాల లబ్దిదారులకు ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లను సరసమైన ధరకు వచ్చేలా చూస్తున్నాం. ఈ చర్యలు విద్యారంగంలో, నైపుణ్య రంగంలో పెనుమార్పులను తీసుకు వస్తాయి. యూనివర్శిటీల రిక్రూట్‌మెంట్లలో సిఫార్సులకు చోటు ఉండరాదు. నియామకాలన్నీ పారదర్శకంగా జరగాలి. క్వాలిటీ బోధనా సిబ్బంది యూనివర్శిటీల్లో ఉండాలని అన్నారు.

Leave a Reply