Take a fresh look at your lifestyle.

డీఎస్సీ కార్యాలయం ముందు ఉపాధ్యాయుల మౌన దీక్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 21 : భార్య భర్తలు ఒకో చోట పనిచేసేలా బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేస్తూ ఉపాధ్యాయ దంపతులు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ‌కార్యాలయ ముట్టడి రణరంగంగా మారింది. లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ‌కార్యాలయం ఎదుట మౌన దీక్షకు ఉపాధ్యాయ స్పౌస్‌ ‌ఫోరమ్‌ ‌పిలుపునిచ్చింది. దీంతో కమిషనర్‌ ‌కార్యాలయం వద్దకు చేరుకుంటున్న ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కసారిగా ఆర్టీసీ బస్సులలో వచ్చిన ఉపాధ్యాయ దంపతులు.. పిల్లలతో సహా కమిషనర్‌ ‌కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌కావడంతో పాటు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఉపాధ్యాయ దంపతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో వారి వెంట చిన్నారులు విలపించారు. మరో పక్క కొంత మంది పోలీసులు చిన్నారులను చేరదీసుకుని..వారి తల్లిదండ్రులను ఈడ్చుకుంటూ వాహనాల్లో తరలించారు.

దాదాపు గంట పాటు అరెస్టుల పరంపర కొనసాగడంతో.. కొందరు ఉపాధ్యాయులు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. 19 జిల్లాల్లో బదిలీలకు అనుమతించిన ప్రభుత్వం మరో 13 జిల్లాల్లో ఆపేయడం అన్యాయమని ఉపాధ్యాయ దంపతులు అన్నారు. వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 ద్వారా ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ‌తక్షణమే జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సంవత్సరకాలంగా 13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీల కోసం ఎదురు చూస్తున్న స్పౌజ్‌ ఉపాధ్యాయులు ఇవాళ డీఎస్సీ కార్యాలయం ముందు మౌన దీక్షకు దిగారు. వందలాదిగా తరలివచ్చిన ఉపాధ్యాయులు.. మౌనంగా తమ ఆవేదనను ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారు. గడిచిన సంవత్సరంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రతి స్పౌజ్‌ ‌బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

దంపతుల బదిలీలను బ్లాక్‌ ‌చేసిన 13 జిల్లాల్లో 2100 మంది బాధితులు ఉండగా, అందులో 615 మందికి మాత్రమే స్పౌజ్‌ ‌బదిలీలు జరుగుతున్నాయని, అది కూడా కేవలం కొద్ది మంది స్కూల్‌ అసిస్టెంట్లకు మాత్రమే అనుమతించి. ఎస్జిటి, పండిట్‌, ‌పీఈటి ఇతర ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరగడంలేదని విస్తృత ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుండి సరైన సమాధానం దొరకక ఆందోళనతో ఉపాధ్యాయ దంపతులు డీఎస్సీ కార్యాలయం ముందు మౌన దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌ ‌లక్డికపుల్‌ ‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ‌కార్యాలయం ముందు మౌన దీక్షకు ఉపాధ్యాయ స్పౌజ్‌ ‌ఫోరమ్‌ ‌పిలుపు నిచ్చింది. ఈనేపథ్యంలో.. హైదరాబాద్‌ ‌లకుడికపూల్‌ ‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ‌కార్యాలయం ముందు 13 జిల్లాల్లో బదిలీల కోసం ఆందోళన చేపట్టారు.

దీంతో టీచర్లు వారిపిల్లలు మౌన దీక్ష ఉద్రిక్తంగా మారింది. కమిషనర్‌ ‌కార్యాలయం చేరుకుంటున్న ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ ఉపాధ్యాయ దంపతులను అరెస్ట్ ‌చేస్తున్న పోలీసులు. ఈ ఆందోళనలో చిన్నారులను సైతం పోలీసులు దారుణంగా అరెస్ట్ ‌చేయడంతో.. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌లో ఉంచిన 13 జిల్లాల్లో 1656 మందికి దంపతుల బదిలీలు నిర్వహించేందుకు ఫైలు సిద్ధమైందని సమాచారం ఉన్నప్పటికీ, 615 మందికి మాత్రమే చేయాలనుకోవడం బాధాకరమని ఉపాధ్యాయులు ఆవేదన చెందారు. 30% మందికే దంపతుల బదిలీలు చేపట్టి, పూర్తిగా అవకాశం ఉన్న క్యాడర్లను పక్కకు పెట్టడం స్పౌజ్‌ ‌బదిలీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలలో ఆవేదన మిగిలిందని ఉపాధ్యాయులు వాపోయారు. సంగారెడ్డి జిల్లాలో ఎస్జీటీ కేడర్‌ ‌లో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే స్పౌజ్‌ ‌బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ జిల్లాలో 362 ఎస్‌ ‌జి టి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాదు సూర్యాపేటలో 28 మంది ఎస్జీటీలలో బదిలీ కోసం అప్లై చేసుకోగా 252 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా 40 మంది ఎస్జీటీలు దంపతులు బదిలీల కోసం అర్జీ పెట్టుకోగా 341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించనున్న ప్రమోషన్ల పక్రియ ద్వారా కూడా వందల సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి.

ఒకటి రెండు క్యాడర్ల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ స్పౌజ్‌ అప్పీళ్ళు అన్నిటినీ క్లియర్‌ ‌చేసే అవకాశం ఉందని, ఉపాధ్యాయుల ఆవేదన చెందారు. సంవత్సరం క్రితం 19 జిల్లాలకు ఇచ్చి,13 జిల్లాలను బ్లాక్లో ఉంచి వివక్షకులు చూపారని, ప్రమోషన్లు బదిలీల సందర్భంగా తమకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ఉపాధ్యాయ దంపతులకు తీరని ఆవేదన మిగిల్చుతున్నారని వాపోయారు. దంపతులు గడిచిన సంవత్సరం గా 13 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతులు బదిలీల కోసం విద్యాశాఖ మంత్రి తో పాటు మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్న. పిల్లాపాపలతో కుటుంబాలుగా జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌ ‌లో, శాంతియుత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిరంతరాయంగా ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయ దంపతులు బదిలీల పక్రియ మాత్రం జరగడం లేదు. ప్రమోషన్లలో బదిలీ నిర్వహిస్తున్న ఈ తరుణంలో సీఎం కేసీఆర్‌ ‌మాత్రమే తమ సమస్యకు పరిష్కారం చూపగలరని, మౌన దీక్ష ద్వారా ఉపాధ్యాయులు చేస్తున్న ఈ విన్నపాన్ని సహృదయంతో స్వీకరించి వెంటనే 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు అందరికీ బదిలీలు జరిపించాలని వేడుకున్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం ఉపాధ్యాయులను జిల్లాల కేటాయింపు పక్రియ 2021 డిసెంబర్లో జరిగింది. ఈ కేటాయింపులో భాగంగా భార్యాభర్తలైన ఉపాధ్యాయులను వారు కోరుకున్న జిల్లాల కేటాయించాలని ప్రభుత్వం మేము 1655 ప్రకారం స్పష్టంగా ఉంది. మేము 1655 ప్రకారం 19 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతులకు జరిపిన ప్రభుత్వం, మిగిలిన 13 జిల్లాలను బ్లాక్‌ ‌లిస్టులో పెట్టింది. వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ, డ్యూటీలు చేస్తూ కష్టనష్టాలను పడుతున్న వారిలో 90 శాతం మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. ఎక్కువ మందికి పది సంవత్సరాలు లోపు వయసున్న పిల్లలు ఉన్నారు. 25 సంవత్సరాల పైబడిన సర్వీసు ఉంది. ఈ పరిస్థితి , బాధ్యతలు విద్యాబోధనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం వారు పై విషయాలను పరిగణలు తీసుకుని వెంటనే 13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతులకు బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు.

Leave a Reply