Take a fresh look at your lifestyle.

విద్యార్థ్దుల వేటలో టీచర్లు

“ఇక కొత్త విద్యాసంవత్సరం ప్రారంబమవుతుంటే ప్రైవేట్‌ ‌టీచర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.మేజ్‌మెంట్‌ ఇచ్చిన అడ్మిషన్‌ ‌టార్గెట్లను చేయించకపోతే నౌకరి ఉంటుందో,ఊసిపోతుందో తెలియని పరిస్దితి అందుకే సెలవుల్లోను కరోనా భయం ఉన్న ఎండలు మండుతున్న ఇంటింటికి తిరుగుతూ మీ పిల్లలను మా కార్పోరేట్‌ ‌సంస్దలో చేర్పించండి.మీకి ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తామంటూ తల్లిదండ్రులను బ్రతిమాలుకుంటున్నారు.”

  • అడ్మిషన్ల కోసం ప్రైవేట్‌ ‌కార్పొరేట్‌ ‌సంస్థల టార్గెట్లు  
  • వెట్టిచాకిరి, శ్రమ దోపిడికి, అంతం లేదా..? 

ప్రైవేట్‌, ‌కార్పోరేట్‌ ‌పాఠశాలలు, కళాశాలలో టీచింగ్‌, ‌నాన్‌టీచింగ్‌ ‌స్టాప్‌ ‌మెడపై అడ్మిషన్ల కత్తి వేలాడుతుంది. కరోనా వల్ల విద్యాసంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంబం అవుతున్న కార్పోరేట్‌, ‌ప్రైవేట్‌ ‌విద్యాసంస్దలు అడ్మిషన్లు ఇస్తేనే ఉద్యోగంలో కొనసాగిస్తామని లేని ఎడల ఉద్యోగం తీసివేస్తామని బెదిరించడంతో ఈ జూన్‌ ‌నెలలో మండే ఎండలో సైతం తెలంగాణ,ఆంద్రప్రదేశ్‌ ‌రాష్ట్రల్లోని ప్రైవేట్‌ ‌టీచర్లు విద్యార్దుల వేటలో పడ్డారు. కరోనా సెలవు వల్ల మార్చి 24 నుంచి ప్రైవేట్‌,‌కార్పోరేట్‌ ‌విద్యాసంస్దలు ఆకస్మికంగా మూసివేశారు.దీనితో 4 నెలల జీతాలను ప్రైవేట్‌ ‌సంస్దలు ప్రైవేట్‌ ‌టీచర్లకు ఇవ్వకుండా ఎగవేశాయి.కరోనా ఉన్న ఇండ్లల్లో ఉన్న సెలవు దినాల్లో పనులు చేయించుకుంటున్నారు. టీచర్లు,అద్యాపకులను భోదనేతర పనులకు ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నారు.ఎండలు మండుతున్న కరోనా భయం వెంటాడుతున్న వర్క్‌షాపులకు హాజరు కావాలంటూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు.కనీసం తెలుగు రాష్ట్రాల్లోని25% విద్యాసంస్దలు కూడా మార్చి నెల నుండి జీతాలు ఇవ్వడం లేదు.జీతాలు అడుగుతే ఫీజులు వసూలు కాలేదంటూ డొంకతిరుగుడు జవాబు చెపుతున్నారు.టి.టి.సీ,బి.ఈ.డి, యమ్‌.ఇ.‌డి తో పాటు పీ.జి కోర్సులు పూర్తి చేసి బావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న ప్రైవేట్‌ ‌టీచర్లు,వారి భవిష్యత్‌ ‌మాత్రం గందరగోళం.అగమ్యగోచరం పనిచేసేది పాఠశాలలోనైన సెలవనే మాటే ఉండదు.ఇక కొత్త విద్యాసంవత్సరం ప్రారంబమవుతుంటే ప్రైవేట్‌ ‌టీచర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.మేజ్‌మెంట్‌ ఇచ్చిన అడ్మిషన్‌ ‌టార్గెట్లను చేయించకపోతే నౌకరి ఉంటుందో,ఊసిపోతుందో తెలియని పరిస్దితి అందుకే సెలవుల్లోను కరోనా భయం ఉన్న ఎండలు మండుతున్న ఇంటింటికి తిరుగుతూ మీ పిల్లలను మా కార్పోరేట్‌ ‌సంస్దలో చేర్పించండి.మీకి ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తామంటూ తల్లిదండ్రులను బ్రతిమాలుకుంటున్నారు.2020-21 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు భారీగా చేయాలంటూ ఆయా కార్పోరేట్‌ ‌సంస్దల మేనేజ్‌మెంట్లు ప్రైవేట్‌ ‌టీచర్లకు అడ్డగోలుగా టార్గెట్లు ఫిక్సు చేస్తున్నాయి.అడ్మిషన్ల సంఖ్యను బట్టే వచ్చే విద్యాసంవత్సరంలో జీతాల చెల్లింపు, ఇంక్రిమెంటి ప్రమోషన్‌, ఉద్యోగభద్రత ఉంటాయని ప్రకటిస్తున్నారు. దీనితో అతీగతీ లేని టీచర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.యాజమాన్యాలు పెట్టే అడ్డగోలు నిబందనలు భరించలేక అలాగని ఉద్యోగం నుంచి బయటకు రాలేక మానసిక ఆవేదనతో ఆగంమాగం అవుతున్నారు.

పరమ పవిత్రమైన భావిభారతపౌరులను తీర్చిదిద్దే ఉపాద్యాయ వృత్తిని ప్రైవేట్‌, ‌కార్పోరేట్‌ ‌విద్యాసంస్దలు యాచక వృత్తిగా మారుస్తున్నారు.అవసరం లేకున్న అడ్డగోలు టార్గెట్లు పెట్టి మెంటల్‌ ‌టెన్షన్‌కు గురిచేస్తున్నారు.ఉదయం,సాయంత్రం స్కూలు మీటింగులు పెట్టి తిట్లదండకాలు అందుకుమటున్నారు. ప్రతీ టీచింగ్‌, ‌నాన్‌ ‌టీచింగ్‌ ఉద్యోగి 20 కొత్త అడ్మిషన్లు చేయకపోతే ఉద్యోగం రెనివల్‌ ‌చేయమని బెదిరిస్తున్నారు. కార్పోరేట్‌ ‌స్కూల్లు, కార్పోరేట్‌ ‌కాలేజీలో పనిచేసే వారు 50 ఆడ్మిషన్లు చేయాలంటూ టార్గెట్లు పెడుతున్నారు. గ్రామీణ మండల,పట్టణ ప్రాంతాల్లో కూడా మండే ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రైవేట్‌ ఉద్యోగులు అడ్మిషన్ల వేటలో బిజీ అవుతున్నారు.మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నారు,ఎక్కడ చదువుతున్నారు,ఏమి చదువుతున్నారు,మా కళాశాల,పాఠశాలలో చేర్పించండి నాణ్యమైన బోదన ఉంటుందంటూ కరపత్రాలను చూపిస్తున్నారు.ముందే సీటును రిజర్వు చేసుకుంటే ఫీజులో రాయితీ ఇస్తామని ప్రచారం చేస్తున్నారు.తల్లిదండ్రుల ఫోన్‌ ‌నంబర్లు తీసుకొని రోజుకు ఒకసారి ఫోన్‌ ‌చేసి అడ్మిషన్లు ఇచ్చి ఉద్యోగాన్ని కాపాడండి అంటూ వేడుకుంటున్నారు.సమాన పనికి సమాన వేతనం అనే సిద్దాంతాన్ని ప్రైవెట్‌ ‌విద్యాసంస్దలు తుంగలో తుంగలో తొక్కుతున్నాయి.అనుభవం మరియు అర్హతలు ఉన్న వారిని ప్రక్కకు పెట్టి శ్రమ దోపిడికి పాల్పడుతున్నారు.ఉపాద్యాయ శిక్షణ పొందని వారిని అనుభవం లేని వారికి తక్కువ జీతాలకు మాట్లాడుకొని విద్యార్దులకునాణ్యత లేని విద్యాబోదనను అందిస్తూ మేనేజ్‌మెంట్‌లు లక్షలకు,కోట్లకు పడగలెత్తుతున్నారు.సెలవు దినాలైన,రెండో శనివారమైన, ఆదివారమైన, జాతీయ సెలవుదినాలైన, పండుగలు, పర్వదినాలైన స్కూల్లు,కళాశాలలకు హాజరు కావాలని హుకుం జారీ చేస్తున్నారు.నెలకు 60వేల నుంచి లక్షన్నర జీతం పొందుతున్న సర్కారు ఉపాద్యాయులు 9గం।।.30 ని।।లకు వెళ్లి 4 గంటలకు ఇంటికి వస్తారు.లక్షల జీతం పొందేవారు 8 గం।।లు పనిచెస్తే 8వేల నుంచి 20వేల జీతం పొందే ప్రైవేట్‌ ‌టీచర్లు,లెక్చరర్లు 10నుండి12 గంటల పాటు బతుకు జీవుడా అంటూ వెట్టిచాకిరి,గొడ్డుచాకిరి చేస్తున్నారు.20-30 ఏండ్ల నుండి పనిచేస్తున్న వారికి జీవితభీమా, ప్రావిడెంట్‌ ‌ఫండ్‌ ‌గాని. ఇఎస్‌.ఐ ‌గాని లేదు. ప్రైవేట్‌ ‌పాఠశాలలు,కళాశాల్లో
ఉపాద్యాయులు, లెక్చరర్ల నియా మకానికి స్టేట్‌ ‌లెవల్లో రాత పరీక్ష నిర్వహించి ప్రభుత్వాలు భాద్యత వహించాలి. కామన్‌ ‌రిక్రూట్‌మెంటును చేయాలి. వెట్టిచాకిరిని నిర్మూలించాలి ఉద్యోగభద్రత కల్పించాలి.

ravula rajesham
రావుల రాజేశం, లెక్చరర్‌
‌బి.ఈ.డి కాలేజి కరీంనగర్‌

Leave a Reply