Take a fresh look at your lifestyle.

ఉపాధ్యాయులు, ఉద్యోగులలో భగ్గుమన్న‘పీఆర్‌సీ’..!

  • గడువు ముగింపుపై నిరసనలు
  • తృణమో,పణమో ఇవ్వరా? ఉపాధ్యాయ సంఘాల ప్రశ్న
  • ఆందోళన వొద్దు, ఈ నెలాఖరుకు పీఆర్‌సీ : ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్‌ ‌కారెం రవీందర్‌రెడ్డి
teachers and employees fire about prc delay
వరంగల్‌ ‌డీఈవో కార్యాలయ ఆవరణలో పీఆర్‌సీ జాప్యానికి నిరసనగా యూఎస్‌పీసీ జాక్టో నిరసన నిరసన.

వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) నివేదికను డిసెంబర్‌-2020 ‌వరకు పొడిగిస్తు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నాలుగోతరగతి ఉద్యోగులు భగ్గుమంటున్నారు. 2018 నుంచి పీఆర్‌సీని వాయిదావేస్తున్నారని, వేతన జీవుల కష్టాలను ప్రభత్వం పట్టించుకోవడంలేదని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ ‌టీచర్స్ ‌ఫెడరేషన్‌ ‌పంచాయతీరాజ్‌ ‌ప్రోగ్రెసివ్‌ ‌టీచర్స్ ‌యూనియన్‌ ‌వంటి ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి, ఆర్‌టీసీ సమ్మెపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వ్యవహరించిన తీరును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగసంఘాల నాయకులు అసంతృప్తి, నిరసన ఉన్నప్పటికీ, మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.తెలంగాణ ప్రోగ్రెసివ్‌ ‌టీచర్స్ ‌ఫెడరేషన్‌, ‌తెలంగాణ టీచర్స్ ‌ఫెడరేషన్‌, ‌తెలంగాణ డెమొక్రటిక్‌ ‌టీచర్స్ ‌యూనియన్‌ ‌వంటి ఉపాధ్యాయ సంఘాలు కలిసి ప్రత్యేక కార్యాచరణ చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి తృణమో,పణమో ఇచ్చే ఆలోచన లేదా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై -2018 నుంచి పీఆర్‌సీని ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మే. 2018లో రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి బిశ్వాల్‌ ‌చైర్మన్‌గా పీఆర్‌సీని ఏర్పరిచింది. పీఆర్‌సీ నివేదిక ఇవ్వాల్సిన నివేదికతేదీలను మూడు సార్లు పొడిగించారు. మంగళవారం డిసెంబర్‌ ‌వరకు గడవు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే పీఆర్‌సీ కమిటీ ఇప్పటికే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పలుదఫాలుగా సమావేశమయ్యింది. టీఆఎన్‌జీవో నాయకత్వంలో ఉద్యోగసంఘాల జేఏసీ 63శాతం ఫిట్‌మెంట్‌ ‌డిమాండ్‌ ‌చేస్తూ ఇదివరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి మహావిజ్ఞాపన అందచేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పీఆర్‌సీ విషయంపైన ఇప్పటికే తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులతో మూడు దఫాలు సమావేశమ య్యారు.

ఇటీవల హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల సందర్భంలో ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులతో భోజనం కూడా చేశారు.వీలున్నంత త్వరలో ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.ఈ విషయాలనే ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రస్తావిస్తున్నారు.హుజూర్‌నగరఎన్నిక, మున్సిపల్‌ ఎన్నికలు, సహకారసంఘాల ఎన్నికలు ముగిసినా పీఆర్‌సీ ప్రస్తావన మాత్రం లేదని ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. భాషాపండితుల పద్నోతులు, పీఈటీల పదోన్నతులు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు వంటి చాలా అంశాలపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంలదేని ఉపాధ్యాయసంఘాలు నిరసనవ్యక్తం చేస్తున్నారు. సెకట్రేరియట్‌లో ఏపీ ఉద్యోగులను ఏపీకి పంపించాలని నినదిస్తున్నప్పటికీ ఇంతవరకు కావాల్సిన చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ సెక్రటేరియట్‌ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే రాష్ట్ర ప్రభుత్వాధినేత స్పందించలేదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆవేదిన. రాష్ట్ర ప్రభత్వం వెంటనే 27 శాతం మధ్యంతర భృతిని ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వాల్సిన బకాయి ఉన్నదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదని, ఆర్థిక పరిస్థితని ఉద్యోగసంఘాలకు వివరించి నచ్చచెప్పి తృణమోపణమో పెంచుతామని అన్నారు. కానీ ఒకేసారి పీఆర్‌సీ గడవు పొడిగించడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హతాశులయ్యారు. గతేడాది నవంబర్‌లోనే పీఆర్‌సీ నివేదిక సిద్ధమయ్యిందని సమాచారం అందింది. అదే సందర్భంలో సీఎం ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్‌ ‌కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ ‌వి.మమత , సత్యనారాయణ తదితర నేతలతో సమీక్ష నిర్వహించారు.

అప్పల్లో పీఆర్‌సీ పైన ఊహాగానాలు చెలరేగాయి, 2015-ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 43‌శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి పీఆర్‌సీని ప్రకటించారు.అదే సందర్భంలో పీఆర్‌సీపైన ఇదివరకు ప్రభుత్వాలు చేసినట్లుగా మీనమేషాలు ఉండవని, ఉద్యోగులకు వేతనాలు పెంచాల్సిన తేదీలు రాగానే తాము ఉద్యోగులను పిలుస్తామని ముఖాముఖి చర్చిస్తామని ఉద్యోగులు కోరుకున్న విధంగా పీఆర్‌సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం కోసం అనన్య త్యాగాలు చేశారని, వారి కోరికలు చెల్లించడం తెలంగాణ ప్రభుత్వ బాధ్యతని ఆయన ఆ రోజులో స్పష్టం చేశారు. అప్పల్లో సీఎం చెప్పిన అంశాలన్నింటినీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రస్తావిస్తున్నారు.మరోవైపున తెలంగాణ నాలుగోతరగతి ఉద్యోగులు విభజన చట్టం ప్రకారం 800 మంది ఏపీలో పనిచేస్తున్నారు. వారందరినీ తెలంగాణకు తీసుకొస్తామని వారు తమ కుటుంబసభ్యులని సీఎం చాలా సార్లు హామీలు ఇచ్చారు.ఈ హామీలు నెరవేరకపోవడం పుండుమీద కారం చల్లినట్లు పీఆర్‌సీ గడువు పొడిగించడంతో నాలుగోతరగతి ఉద్యోగులు చాలా భావావేశాలకు లోనవుతున్నారు.పీఆర్‌సీని సాధించేందుకు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆలోచనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బుధవారం తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శితో సమావేశమయ్యారు. పీఆర్‌సీ గడువు పెంపును ప్రశ్నించారు.వెంటనే పీఆర్‌సీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నెలాఖరుకు పీఆర్‌సీ వస్తుంది:
ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్‌ ‌కారం రవీందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరువరకు పీఆర్‌సీని ప్రకటిస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రిపైన తమకు నమ్మకం ఉన్నదని తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్‌ ‌కారం రవీందర్‌రెడ్డి చెప్పారు. సీఎస్‌తో సమావేశమైన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల ఖాళీలు, జిల్లాలవారీగా క్యాడర్‌‌స్ట్రెంత్‌ ‌తదితర ఉద్యోగుల సమస్యలపైన నివేదికలను సిద్ధం చేసేందుకు గడువును పొడిగించారని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ఉ జేఏసీ చైర్మన్‌తో పాటు సెక్రటరీ జనరల్‌ ‌వి.మమత, తెలంగాణ ఉద్యోగుల అధ్యక్షుడు పద్మాచారి, సత్యనారాయణ, కస్తూరి వెంకటేశ్వర్లు తదితర నాయకులు సీఎస్‌తో సమావేశమయ్యారు.

Leave a Reply