గిరిపుత్రులకు ఆన్లైన్ ద్వారా విద్యాభోదనను ఇంటి నుండే నేర్చుకునే విధంగా గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక దృష్టి సారించటం ప్రతీ గిరిజన విద్యార్ధినీ , విద్యార్ధులకు విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు గాను ఉపాధ్యాయులు ప్రత్యేక చొర•వ చూపటం అభినందనీయమని గిరిజన సంక్షేమశాఖ గిరిజన కమీషనర్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ హైద్రాబాద్ క్రిష్టియానా జడ్ చాంగ్తూ అన్నారు. శుక్రవారం హైద్రాబాద్ లోని కమీషనర్‌లో గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం నుండి వీడియో కాన్సరెన్సు ద్వారా ఉమ్మడి జిల్లాల గిరిజన సంక్షమ శాఖ ఎస్జిటుల హెచ్‌యంలు విడతల వారీగా రెండవ విడత ఆన్లైన్ శిక్షణా ముగింపు కార్యక్రమం జరుగుతున్న ఆన్లైన్ శిక్షణను వీడియో కాన్సరెన్సు ద్వారా పర్యవేక్షించి తగు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ మరియు యంసిహెచ్ ఆర్డి హైద్రాబాద్ వారి ఆధ్వర్యంలో ఇన్స్టేటివ్ శిక్షణ కార్యక్రమం మూడు రోజలు ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ప్రస్తుతం రెండవ విడత కార్యక్రమంలో పాల్గొన్న ఎస్జిటిలు హెచ్‌యంలు పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుని కోవిడ్ 19 కరోనా లాక్‌డైన్‌లో కారణంగా శిక్షణ వాయిదా వేయటం పడిందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం యంసిహెచ్ఆర్డి హైద్రాబాద్ వారి సహకారంతో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మొట్టమొదటి సారిగా గిరిజన ఉపాధ్యాయులు వెబ్ మోడ్ ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ భద్రాచలం మరియు ఖమ్మం ఇజల్లా పరిధి ఉపాధ్యాయులకు అందించటం జరిగిందని అన్నారు. దీనిక సంబంధించిన రిసోర్స్ పర్సన్‌కు శిక్షణ మార్చి నెలలో భద్రాచలం వైటిసి భవనం నందు జరిగిందని అన్నారు. బేస్ లెవెల్ శిక్షణ పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు ఇవ్వవలసి ఉన్నదని ఈ తరుణంలో శిక్షణలో పాల్గొనేల ఉపాధ్యాయులకు తమ ఇండ్లలోనే ఉండి స్మార్డ్ ఫోన్ ద్వారా యంసిభెచ్ ఆర్డి సిస్కో యాప్ మరియు ఐడి మెయింట్ పాస్వార్డు ఉండిలాగిన్ అయి శిక్షణ తీసుకున్నారు. ఇలా ప్రతీ బ్యాచ్‌కు 100 మంది ఉపాధ్యాయులు చొప్పున 663 మంది ఉపాధ్యాయులు పొందుతారు. ఉపాధ్యాయులు విదిగా 100 శాతం ట్రనింగ్ పూర్తి చేసి తదుపరి విద్యాభోదన పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హైద్రాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరల శిక్షణా కేంద్రం డైరెక్టర్ బిపి ఆచార్య, సంబంధిత జిల్లాల ఎల్ ఎఫ్ హెచ్‌యంలు ఎస్జిటిలు పాల్గొన్నారు.