Take a fresh look at your lifestyle.

టీ కాంగ్రెస్‌లో ఐక్యతా రాగం

  • అధిష్టానం ఆదేశాలతో దిగొచ్చిన సీనియర్లు
  • అధికార పార్టీపై పోరులో రేవంత్‌కు సహకారం
  • కలసి ఉంటేనే వొచ్చే ఎన్నికల విజయం సాధిస్తామన్న వీహెచ్‌

టీ కాంగ్రెస్‌లో సీనియర్‌ ‌నేతలు ఐక్యతా రాగం ఆలపిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాలంటే అధికార పార్టీపై అంతా కలసి పోరా•ం చేయాలన్న కాంగ్రెస్‌ ‌పార్టీ అధిష్టానం ఆదేశాలలో ఒక్కో నేత పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. టీ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌ ‌రెడ్డిని నియమించినప్పటి నుంచి ఆయనకు పార్టీ సీనియర్‌ ‌నేతల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని ఆశించిన భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, విహెచ్‌ ‌వంటి సీనియర్‌ ‌నేతలను కాదని పార్టీ అధిష్టానం రేవంత్‌రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టింది. దీంతో నిరాశ చెందిన ఈ నేతలంతా రేవంత్‌ ‌రెడ్డితో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు.

అయినప్పటికీ రేవంత్‌ ‌రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన ఆత్మ గౌరవ సభల పేరిట భారీ సభలను నిర్వహించి కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో నయా జోస్‌ ‌నింపారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతున్నారు. రేవంత్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ పటిష్టంగా తయారవుతున్నదని పార్టీ అధిష్టానం గుర్తించింది. ఈ నేపథ్యంలో పార్టీలోని కొందరు సీనియర్‌ ‌నేతలు రేవంత్‌ ‌రెడ్డికి సహకరించడం లేదన్న అంశాన్ని గుర్తించి ఇటీవల వారందరినీ ఢిల్లీకి పిలిపించింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ ‌ఘోరంగా ఓడిపోవడంతో ఆ ఓటమికి బాధ్యతను పార్టీ సీనియర్‌ ‌నేతలంతా రేవంత్‌ ‌రెడ్డిపై నెట్టివేసే ప్రయత్నం చేశారు.

అందుకు ప్రతిగా రేవంత్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేతలు తనకు ఎవరూ సహకరించడం లేదనీ, కలసి కట్టుగా పనిచేస్తే అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదని అధిష్టానానికి విన్నవించారు. అంతేకాకుండా కొందరు సీనియర్‌ ‌నేతలు తనపై వ్యక్తిగత కక్షతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పరోక్షంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, భట్టి విక్రమార్కలపై ఫిర్యాదు చేశారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీలో సీనియర్‌ ‌నేతలను ఏకతాటిపైకి తీసుకు రావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సీనియర్‌ ‌నేతలంతా కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌ ‌రెడ్డికి సహకరించాల్సిందేననీ, ఆయన నిర్వహించే కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించింది. దీంతో కాస్త స్వరం తగ్గించిన పార్టీ సీనియర్లు రేవంత్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడటం మానివేశారు. అంతేకాకుండా తాజాగా,  రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ• వంత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు.

అంతేకాకుండా టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ ‌రెడ్డి నియామకాన్ని వ్యతిరేకించిన సీనియర్‌ ‌నేత వీహెచ్‌ ‌పార్టీలోని నాయకులంతా బేధాభిప్రాయాలను పక్కనబెట్టి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నేతలంతా కలసి కట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికలలో అధికారం కాంగ్రెస్‌ ‌పార్టీదేననీ, అందుకోసం రేవంత్‌ ‌రెడ్డి చేస్తున్న పోరాటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి మంచి రోజులు వచ్చినట్లేననీ, ఇదే పద్దతిలో ముందుకు సాగితే వచ్చే ఎన్నికలలో అధికారం కాంగ్రెస్‌ ‌పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply