Take a fresh look at your lifestyle.

డిజిటల్‌ ‌సభ్యత్వంలో టీ కాంగ్రెస్‌ ‌నేతలు బిజీ…బిజీ

  • తెలంగాణకు 30 లక్షల టార్గెట్‌ ‌విధించిన అధిష్టానం
  • పార్లమెంటు స్థానానికి ఇన్‌చార్జి, అసెంబ్లీకి సమన్వయకర్త
  • దేశంలో తెలంగాణలోనే డిజిటల్‌ ‌మెంబర్‌షిప్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి :
తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. బూత్‌ ‌స్థాయి నుంచి మొదలుకుని నగర స్థాయి వరకు పార్టీ సభ్యత్వాలు చేయించాలని పార్టీ రాష్ట్ర శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కొరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే్ట డిజిటల్‌ ‌మెంబర్‌షిప్‌కు అవకాశం కల్పించింది. డిసెంబర్‌ 9‌న కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణలో డిజిటల్‌ ‌మెంబర్‌షిప్‌ను పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో మొత్తంగా 30 లక్షల డిజిటల్‌ ‌మెంబర్‌షిప్‌లను పూర్తి చేయాలని కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి లక్ష్యం నిర్దేశించింది. కాగా, పార్టీ అధిష్టానం నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో టీ కాంగ్రెస్‌ ‌నేతలు బిజీ బిజీగా గడుపుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్‌ ‌మెంబర్‌షిప్‌ ‌చీఫ్‌ ‌కో ఆర్డినేటర్‌గా పార్టీ సీనియర్‌ ‌నేత హర్కర వేణుగోపాల్‌ను పార్టీ అధిష్టానం నియమించింది.ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జిని, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను నియమించింది. దీంతో అధిష్టానం నిర్దేశించిన లక్ష్య సాధనలో భాగంగా  కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు,కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు ప్రజలతో డిజిటల్‌ ‌మెంబర్‌షిప్‌లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గత 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ అప్రజాస్వామ్య, నియంతృత్వ పాలనను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా రైతులు, యువకులను కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యత్వం చేర్పించడంపై పార్టీ నేతలు దృష్టి సారిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడచినప్పటికీ అరకొర ఉద్యోగ నియామకాలే తప్ప చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయలేదు.

ఈ కారణం చూపి కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు యువకులు, నిరుద్యోగులను అధికారం కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యత్వాలను ఇప్పిస్తున్నారు. అలాగే, వచ్చే యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదని సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు. దీనికి తోడు ఈ సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కూడా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మొత్తంగా కొనుగోలు చేయడంలో విఫలమైంది. దీనిని కూడా కారణంగా చూపి కాంగ్రెస్‌ ‌నేతలు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమనీ, ఆ పార్టీపై వచ్చే ఎన్నికలలో పోరాటం చేయాలంటే కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరాలని చెబుతూ సభ్యత్వాలు చేయిస్తున్నారు.

Leave a Reply