Take a fresh look at your lifestyle.

వైకాపాలో చేరికకు గంటా రంగం సిద్దం

చేరికకు జగన్‌ ‌లైన్‌ ‌క్లీయర్చేశారని ప్రచారం

విశాఖపట్టణం,జూలై 23 : టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలబోతున్నది. ఇంతకాలం ఊగిసలాటలో ఉన్న మాజీమంత్రి గంట శ్రీనివాసరావు వైకాపాలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది.  సీనియర్‌ ‌నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు టీడీపీకి గుడ్‌ ‌బై చెప్పనున్నట్లు సమాచారం. వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగే కీలక నేతలతో మంతనాలను కూడా ముగించినట్లు సమాచారం. గంటా చేరికకు సీఎం జగన్‌ ‌నుంచి క్లియరెన్స్ ‌కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఆయనతో మంతనాలు చేసినట్లు గంటా సన్నిహితులు పేర్కొంటున్నారు. ఆగస్టు 15 న ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్‌ ‌ప్రభుత్వం తలపోసింది. ఈ కార్యక్రమం వేదికగానే గంటా వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. అయితే వైసీపీలో గంటా చేరికపై… సీనియర్లు అయిన మంత్రి అవంతి శ్రీనివాస్‌, ‌విజయసాయి రెడ్డి మోకాలడ్డుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ వైసీపీలో గంటా చేరిక ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో చేరనున్నారన్న ప్రచారం ఊపందుకుంది.

Leave a Reply