Take a fresh look at your lifestyle.

రైతులకు ఇచ్చేది గోరంత.. చెప్పేది కొండంత

టీడీపీ నేత ఆలపాటి రాజేందప్రసాద్‌ ‌విమర్శ
అమరావతి,మే 25 : తాను రైతు అని గర్వంగా చెప్పుకోలేని ధీన స్థితిలోకి రైతులను జగన్‌ ‌రెడ్డి దిగజార్చారని టీడీపీ నేత ఆలపాటి రాజేందప్రసాద్‌ ‌విమర్శించారు. అడుగడుగున రైతులకు అన్యాయం చేస్తూ వందల కోట్ల తప్పుడు ప్రకటనలతో దగా చేస్తూ జగన్‌ ‌రెడ్డి రైతు ద్రోహిగా చరిత్రలో మిగిలి పోయారన్నారు. ఉచిత పంటల బీమా పేరుతో ఇచ్చింది గోరంత.. ప్రచారం కొండంత  చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రకటనలకు పెట్టే ఖర్చులో 10శాతం కూడా రైతులకు చెల్లించడం లేదన్నారు. 2020 ఏడాది ఖరీఫ్‌లో 7 తుఫాన్లతో 37 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి రూ.15 వేల కోట్లు నష్టపోతే జగన్‌ ‌రెడ్డి ప్రభుత్వం కేవలం రూ.1820.23 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్ధతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలంకారప్రాయంగా మార్చేశారని వ్యాఖ్యానించారు. రైతులకు బేడీలు వేసిన ముఖ్యమంత్రి రైతులకు న్యాయం చేస్తారని ఆశించడం అత్యాసే అవుతుందన్నారు. జగన్‌ ‌రెడ్డి మరో జన్మ ఎత్తినా రైతు బాంధవ్యుడు కాలేడని ఆలపాటి రాజేందప్రసాద్‌ అన్నారు.

Leave a Reply