Take a fresh look at your lifestyle.

కొలువుల ముచ్చట మరచిన ముఖ్యమంత్రి

యువతకు నిరాశ మిగిల్చిన కెసిఆర్‌
‌టిడిపి జిల్లా అధికార ప్రతినిధి కొప్పుల రమేష్

నాగర్‌కర్నూల్‌, ‌సెప్టెంబర్‌ 15 (‌ప్రజాతంత్ర విలేకరి) : ముఖ్యమంత్రి కొలువుల ముచ్చట మరిచారని మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువతకు కేసీఆర్‌ ‌నిరాశే మిగిల్చారని తెలుగు దేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కోప్ఫుల రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావే శంలో జిల్లా అధికార ప్రతినిధి కొప్పుల రమేష్‌ ‌మాట్లాడుతూ…తెలంగాణ ఉద్యమ సమయంలో యువత కీలక పాత్ర పోషిం చారని కాని రాష్ట్రంవచ్చి ఏడేళ్లు అవుతు న్నా కొత్తగా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని కొప్పుల రమేష్‌ ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వేలాది మంది డిగ్రీలు పూర్తి చేసినా కాని ఉద్యోగాలు రావడం లేదని అన్నారు.చాలా మంది యువకులు ఉద్యోగాలకు అర్హత వయస్సు దాటిపోయి ఏమీ తోచని స్థితిలో ఉన్నారని అన్నారు.వారంతా తెలంగాణ ఉద్యమ సమయంలో ముందుండి ఉద్యమాన్ని నడిపారని గుర్తు చేశారు.మ్నుఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం వస్తుంది అని సభలలో ప్రసంగించారని,కానీ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమా వేశాలలో ఉద్యోగాల గూర్చి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల గూర్చి ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమని అన్నారు.

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని, పాక్ట్యరీలను ఏర్పరచి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాది అవకాశాలు కల్పిస్తానన్న కెసిఆర్‌ ‌తె లంగాణ రాష్ట్రం ఏర్పా డిన తరువాత ఎంత మందికి ఉద్యోగ అవ కాశాలు కల్పించారని ప్రశ్నించారు. కెసిఆర్‌ ‌కుటుంబంలో మాత్రం రాజకీయ ఉద్యోగా అవకాశాలు కల్పిం చుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలుగా చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. ఆమర వీరుల కుటుంబాలను అందుకుంటానన్న కెసిఆర్‌ ‌వారి గురించి మరచి పోయారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక ఉపాది కారువై వారి కుటుంబాలు వీధి పాలు అవుతున్నాయని అన్నారు. రెండు రోజుల క్రిందట అసెంబ్లీ ముందు ఒక నిరుద్యోగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుడా మాకు ఉద్యోగాలు రాలేదని పెట్రోల్‌ ‌పోసుకుని తన శరీరాన్ని కాల్చుకున్నాడని అన్నారు. కా•నీ ఏ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించ లేదని అన్నారు. మ్నుఖ్యమంత్రి ఇంకా ఎంత మంది ప్రాణలతో చెలగాటం ఆడతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మేల్కొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. లేని యెడల తెలుగు దేశం పార్టీ తరఫున ధర్నా కార్యక్రమలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక కార్యదర్శి బాలకృష్ణ, ఆర్గనైజింగ్‌ ‌సెక్రటరీ జాఫర్‌, ‌రాము ,శ్రీరాం లింగేశ్వర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!