Take a fresh look at your lifestyle.

ఎపి లో టీడీపి పరువు తీసిన పురపాలన …

  • టీడీపీకి 30.73 శాతం ఓట్లతో రెండు మున్సిపాలిటీ
  • 4.67 శాతానికి పరిమితమైన జనసేన
  • బీజేపీకి 2.41 శాతం
  • స్వతంత్రులు – 5.73 శాతం
  • నోటా – 1.07 శాతం

ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించగా జగన్మోహన్ రెడ్డి విజయకేతనం ఎగరేశారు. నలభైఏళ్ళ రాజకీయ ఇండస్ట్రీకి గుత్తేదారుగా చెప్పుకునే తెలుగుదేశం, దానిఅధినేత చంద్రబాబునాయుడు కోలుకోలేని దెబ్బతిన్నారు. 52.63 శాతం ఓట్లు సాధించి మొత్తం 75 ముిసిపాలీటీలలో 73 మున్సిపాలిటీలను వైసీపీ స్వాధీనం చేసుకోవడమేగాక, మొత్తం 12 కార్పొరేషన్ లకు ఓట్లు లెక్కింపు జరగని ఏలూరు మినహా 11 కార్పొరేషన్ లలో విజయ ఢంకా మోగించింది. వైకాపా విజయ ఢంకా మోతకు ప్రతిపక్షాల చెవులు కళ్ళు దిమ్మెరపోయాయి. 75 మున్సిపాలిటీలలోని 2122 వార్డులకుగాను 1762 వార్డులను వైసీపీ గెలిచింది. మొత్తం పోలైన ఓట్లలో 52 .63 శాతం ఓట్లతో 88 శాతం విజయాలు నమోదు చేసింది. తలుగుదేశం పార్టీ కేవలం 30 .73 శాతం ఓట్లతో 271 వార్డులకు మాత్రమే పరిమితమయి 12 శాతం మాత్రమే దక్కించుకోగలిగింది . బీజేపీ ,జనసేనల మిత్రపక్షంగా జతకలిపి పోటీచేసినా ఫలితాలునిరాశా జనకమే. జనసేనకు 18 వార్డులు , బీజేపీకి అక్షరాల 7 వార్డులు మాత్రమే వచ్చాయి. ఒక్క శాతం ఓట్లు కూడా దక్కించుకోలేని దుస్థితి. . ఈ రెండు పార్టీలకు కలిపి 7.08 ఓట్ల శాతం ఓట్లు మాత్రం దక్కాయి.

కార్పొరేషన్ లలోని మొత్తం 671 డివిజన్లలో వైసీపీ 475 , టీడీపీ 71 ,జనసేన 7 గెలుచుకోగా, బీజేపీ ఒక్క డివిజన్ కు మాత్రమే పరిమితమైంది. . మిగిలిన స్థానాలను ఇతరులు గెలిచారు. వైసీపీ ప్రభంజనం ముందు ఇతర పార్టీలు నిలవలేక పోయాయి. టీడీపీ కొంత వరకే తట్టుకుని పోటీ ఇచ్చినా మిగిలిన పార్టీల ప్రభావం శూన్యమే.. కడప జిల్లా మైదుకూరు , అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలలో మాత్రమే తెలుగుదేశం ఎక్కువ స్థానాలు గెలిచింది. గత 2014 మున్సిపల్ ఎన్నికలతో పోల్చుకుంటే అప్పుడు మున్సిపాలిటీలలో మొత్తం 2571 వార్డులుండగా. అందులో 1424 వార్డులు టీడీపీ గెలుచుకోగా, వైసీపీ కి 939 వార్డులు దక్చాయి. మిగిలినపార్టీలు 208 వార్డులు పంచుకున్నాయి .తాజా ఎన్నికలలో వైకాపా విజయదుందుభికి కారణం విశ్లేషిస్తే, ఎన్నికలంటే వైకాప వెన్ను చూపుతున్నదని, తమ బలమేమిటో చూపిస్తామని సవాల్ విసిరిన నేతలు ప్చారంలోనే పలాయనం చిత్తగించారు. ఆ గొంతులు మూగపోయాయి. ఓటమి అనంతరం, బెదిరించి, ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకున్నారని మూసలోపోసిన ఆరోపణలు చేస్తున్నారు.

జగన్ పాలనకు ఈ ఫలితాలు ప్రజామోదమేనని, ఒక విధంగా రెఫరాండంగానే భావించాలంటున్నారు. ప్రధానంగా ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్ళిన సంక్షేమ కార్యక్రమాలే విజయాలకు కారణ మని, అందుకు సందేహం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతే కాక కరోనా పెనుభూతాన్ని ధైర్యంగా ఎదుర్కోవ డంలో ఏపీ అగ్రస్థానం లో నిలపడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు బాగా పనిచేశా యంటున్నారు.. ప్రజలకు తాను ఉన్నాను అనే భరోసా కల్పించకలిగారని, చెప్పిన మాటకు కట్టుబడే ముఖ్యమంత్రిగా ప్రజలలో దృఢాభిప్రాయం ప్రజల్లో నాటగలిగారని అంటున్నారు. 2019శాసనసభ ఎన్నికల్లో 51 శాతం ఓట్లతో 151 సీట్లు గెలుచుకున్న జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 52 .63 శాతం ఓట్లు పొందగలిగారని, టీడీపీ గత 40 శాతం ఉన్న ఓట్ల నుంచి 30 శాతానికి పడిపోవడానికి చంద్రబాబు ప్రతికూల కారణమే నంటున్నారు. జనసేన ఓట్లు7 శాతం నుంచి 4 .67 శాతానికి దిగజారింది. బీజేపీ స్వయంకృతాపరాధాలే రోజురోజుకు దిగజారుస్తున్నాయని విమర్శ లున్నాయి. ప్రతిపక్షాలు తమ పొరపాట్లను తెలిసికొని ముందుకు సాగితేనే భవిష్యత్ ఉంటుందనే నఅభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

Leave a Reply