Take a fresh look at your lifestyle.

వైకాపా పాలనలో ప్రజల్లో నిరాశా నిస్పృహలు

  • రాష్ట్రంలో మతసామరస్యం దెబ్బతిన్నది
  • ఆలయాలపై దాడులు చేస్తున్నా పట్టింపు లేదు
  • నిరుద్యోగులకు సిఎం జగన్‌ ‌టోకరా వేశారు
  • సొంత చెల్లెలు షర్మిల తెలంగాణపై పడ్డది
  • కర్నూలు కార్పోరేషన్‌ ‌ప్రచారంలో చంద్రబాబు రోడ్‌షో

‌వైకాపా పాలనతో రాష్ట్ర ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడు చేస్తున్నారని ఆరోపించారు. తెదేపా హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే.. జగన్‌ ‌విధ్వంసానికి పెద్దపీట వేశారని చంద్రబాబు ఆక్షేపించారు.

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వైకాపా నేతలు బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలున్నాయా? అని ప్రశ్నించారు. తెదేపా గెలిచిన స్థానాలనూ వైకాపా నేతలు వారి ఖాతాలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటేసే అవకాశమే లేకపోతే ప్రశ్నించే అవకాశం వస్తుందా? ప్రశ్నించే అవకాశం లేకపోతే నాయకులు భయపడతారా? అని ప్రశ్నించారు. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు. సొంత చెల్లెలు షర్మిలనే జగన్‌ ‌రోడ్డున పడేశారని అన్నారు. షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్‌ ‌మోసం చేశారని ఆరోపించారు. జగన్‌ ‌పిరికి పంద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్‌ ‌విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఏం పీకారని జగన్‌కు ఓటేస్తారని, ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు అన్నారు.

కర్నూలు కార్పొరేషన్‌ ‌పరిధిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని పెద్దమార్కెట్‌ ఎదురుగా శ్రీలక్ష్మి నరసింహస్వామి కల్యాణ మండపం వద్దకు చేరుకుని పాతబస్టాండు, గోశా హాస్పిటల్‌, ‌స్టేట్‌ ‌బ్యాంకు, ఎస్టీబీసీ కళాశాల వి•దుగా ఐదు రోడ్ల కూడలి, మౌర్యఇన్‌, ‌బంగారు పేట, ఈద్గా, కొత్తబస్టాండు, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్‌కు వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. రోడ్‌షోలో చంద్రబాబు ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలతో మాట్లాడుతారు. చెన్నమ్మసర్కిల్‌ ‌వద్ద చైతన్య రథం నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. టీడీపీని గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చంద్రబాబు వివరిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Leave a Reply