Take a fresh look at your lifestyle.

రైతాంగానికి మద్దతుగా టీ సీఎల్పీ రైతులతో ముఖాముఖి

ఈనెల 9న ఆదిలాబాద్‌లో ప్రారంభం, 21న ఖమ్మంలో ముగింపు
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్: ‌కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు నిరసనగా రాష్ట్రంలోని రైతాంగానికి మద్దతు తెలపాలని తెలంగాణ కాంగ్రెస్‌ ‌శాసనసభా పక్షం నిర్ణయించింది. ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు రెండు నెలలకు పైగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.అలాగే, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ముందు ఆ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఆ తరువాత యూ టర్న్ ‌తీసుకుంది. కొత్త చట్టాలు కారణంగా రైతులు ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోవచ్చంటూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని ప్రకటించారు.

కేంద్ర చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా భవిష్యత్తు విషయమై తెలంగాణలోని రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది.ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తెలంగాణ కాంగ్రెస్‌ ‌శాసనసభా పక్షం తరపున రైతాంగానికి అండగా నిలవాలని నిర్ణయించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే ట్రాక్టర్‌ ‌ర్యాలీ, మానవహారం దీక్ష నిర్వహించామని చెప్పారు.

తెలంగాణవ్యాప్తంగా నేరుగా రైతుల దగ్గరికే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలబడాలనీ, భరోసా కల్పించాలని రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఈనెల 9న ఆదిలాబాద్‌లో ప్రారంభమై 21న ఖమ్మంలో ముగుస్తుందని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Leave a Reply