Take a fresh look at your lifestyle.

సిమెంట్‌ అ‌క్రమ నిల్వలపై టాస్క్ ‌ఫోర్స్ ‌దాడులు

పక్కా  సమాచారం మేరకు టాస్క్ ‌ఫోర్స్ ఇన్స్పెక్టర్స్, ‌నంది రామ్‌, ‌మధు, మడికొండ పోలీస్‌,  ‌టాస్క్ ‌ఫోర్స్ ‌సిబ్బంది సంయుక్తముగా మడికొండ గ్రామ శివారులో శుక్రవారం అక్రమ సిమెంట్‌ ‌నిల్వ ఉందనే సమాచారం మేరకు అక్కడకు వెళ్ళి చూడగా అక్కడ 760 బ్యాగుల సిమెంట్‌ను ఖాళీ ప్రదేశంలో డంప్‌ ‌చేస్తుండగా లారీ డ్రైవరు, లారీ ఓనర్‌ ‌లను పట్టుకున్నారు.

వారిని విచారించగా కాజిపేట డిజిల్‌ ‌కాలనికి చెందిన సురేష్‌ ఉమా మహేశ్వర ఐరన్‌ అం‌డ్‌ ‌సిమెంట్‌ ‌షాప్‌ ‌డీలర్‌, ఇం‌జనీర్‌, ‌జనగామం వారి నుండి చిల్పూర్‌ ‌వాగులో నిర్మాణ పనులు కొరకు పర్మిషన్‌ ‌లెటర్‌ ‌పొందినట్లుగా ఒక నిఖిలి పర్మిషన్‌ ‌లెటర్‌ ‌ను తయారు చేసి నాగార్జున సిమెంట్‌ ‌కంపెనీ వారికి పంపించగా నాగార్జున కంపెనీ వారు మట్టంపల్లి, కోదాడ్‌ ‌నుండి 760 సిమెంట్‌ ‌బ్యాగులను,   అక్రమముగా నిర్ణీత ధరల కంటే ఎక్కువ ధరలకు రూ. 450 నుండి 500లకు ఒక బ్యాగ్‌ ‌చొప్పున అమ్ముతుండగా పట్టుకొని అట్టి లారీని, 760 సిమెంట్‌ ‌బస్తాలను సీజ్‌ ‌చేసినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply