Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ ‌నష్టాల నివారణలో వాణిజ్య, పరిశ్రమలదే కీలక పాత్ర గవర్నర్‌ ‌తమిళిసై

‌కోవిడ్‌ 19 ‌ద్వారా కలిగిన నష్టాలను పూడ్చడంలో, ప్రజలకు ఉపాధి కల్పించడంలో వాణిజ్య, పరిశ్రమలదే కీలకపాత్ర అని రాష్ట్ర గవర్నర్‌ ‌డా.తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. వాణిజ్య, పారిశ్రామిక రంగాలు పునరుత్తేజితం అవుతూ లక్షలాది ప్రజల ఉపాధి వ్యవస్థలను కాపాడుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం ఫెడరేషన్‌ ఆఫ్‌ ‌తెలంగాణ చాంబర్స్ అం‌డ్‌ ‌కామర్స్ ఆధ్వర్యంలో కోవిడ్‌ ‌నష్టనివారణలో ప్రభుత్వాల వ్యూహాత్మక చర్యలు అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ‌మాట్లాడుతూ భారత  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరైన సమయంలో సరైన చర్యలతో ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా  ఇదే మార్గంలో సమర్థవంతమైన చర్యలు తీసుకుందని తెలిపారు.

పీపీఈ కిట్లు, మాస్కుల కొరతను ఎదుర్కొన్న దేశం ఇప్పుడు రోజుకు ఐదు లక్షల పీపీఈ కిట్లు, మూడున్నర లక్షల మాస్కుల తయారీ సామర్ధ్యాన్ని సాధించిందని తెలిపారు. ప్రస్తుతం మన దేశం వెంటిలేటర్లు, టెస్టింగ్‌ ‌కిట్లు, ప్రాణాధార ఔషధాలను ఎగుమతి చేస్తున్నదని పేర్కొన్నారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శుభ్రత ద్వారా కోవిడ్‌ను నివారించవచ్చనీ, కానీ కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇవి పాటించకపోవడం ఆవేదన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. ఇరవై లక్షల కోట్ల ఆత్మ నిర్శర ప్యాకేజి, వ్యవసాయానికి రూ.లక్ష కోట్లు, వలస కార్మికుల సంక్షేమం తదితర చర్యలు కోవిడ్‌ 19 ఉపశమన చర్యలుగా తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిక్కి తెలంగాణ చాప్టర్‌ అధ్యక్షుడు రమాకాంత్‌ ఇనాని, సీనియర్‌ ‌వైస్‌ ‌ప్రసిడెంట్‌ ‌భాస్కర్‌ ‌రెడ్డి, సీఈవో ఖ్యాతి నరవానే, మాజీ అధ్యక్షులు హరిశ్చంద్ర ప్రసాద్‌, ‌శేఖర్‌ అగర్వాల్‌, ‌కరుణేంద్ర జాస్తి పాల్గొన్నారు.

Leave a Reply