Take a fresh look at your lifestyle.

గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న తమిళిసై

ప్రత్యేక పుస్తకం ఆవిష్కరణ.. పలువురు సీనియర్‌ ‌జర్నలిస్టులు హాజరు

తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన విధుల నిర్వహణ, అనుభవాలపై ఆమె ఓ పుస్తకం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మిడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణతో పాటు పలువురు సీనియర్‌ ‌జర్నలిస్టులు, రాజ్‌భవన్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు. పుస్తకం విడుదల చేసిన అనంతరం తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌ప్రసంగించారు. గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. తనకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ వేగంగా కొనసాగుతుందని గవర్నర్‌ ‌స్పష్టం చేశారు.

పేద ప్రజలకు ప్రభుత్వ హాస్పిటళ్లలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో వసతులు మరింత పెంచాలని సూచించారు. వ్యాధులు, వరదలు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం పనితీరు బాగుందని ప్రశంసించారు. మొబైల్‌ ‌టెస్టింగ్‌ల ద్వారా కోవిడ్‌ ‌టెస్టులు నిర్వహించడం మంచి నిర్ణయం అన్నారు. తెలంగాణ దేశానికే రైస్‌ ‌బౌల్‌ ఆఫ్‌ ఇం‌డియాగా మారిందని కొనియాడారు. సీఎం కేసీఆర్‌తో సత్సంబంధాలు ఉన్నాయని గవర్నర్‌ ‌తమిళిసై పేర్కొన్నారు. పుదుచ్చేరికి పీపీఈ కిట్లు, మాస్కులు అందజేసిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలావుంటే రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ను శాసనసభ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌తెలంగాణ గవర్నర్‌గా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యలు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply