Take a fresh look at your lifestyle.

ఈటెలతో ఫోన్లోనే మాట్లాడా..!: కిషన్‌ ‌రెడ్డి

నేరుగా కలసి ఇంకా చర్చించలేదు
ఈటెల వ్యవహారంపై క్లారిటీ ఇచ్చి కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌మే25: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను తాను నేరుగా కలవడం కానీ ఆయనతో చర్చించడం గానీ జరగలేదని, అయితే ఆయనతో ఫోన్‌లో మాట్లాడానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తనను కలిసేందుకు ఈటల సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను ఈటలను కలవలేదు.. ఫోన్లో మాత్రమే మాట్లాడానని చెప్పారు. భవిష్యత్‌లో ఈటలతో చర్చలు జరుపుతానన్నారు. అసెంబ్లీలో ఈటలతో కలసి 15ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈటల రాజేందర్‌ను ఎప్పుడు కలవాలనేది నిర్ణయించుకోలేదని చెప్పారు. అందర్నీ కలుస్తున్నాను.. తనను కూడా కలుస్తానని ఈటల తనతో అన్నారన్నారు. హుజూరాబాద్‌కు ఉపఎన్నిక వస్తే పోటీ చేయాలా లేదా అనే విషయాన్ని అధిష్ఠానంతో చర్చించలేదన్నారు.

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌.. ‌తన రాజకీయ భవిష్యత్‌ ‌కోసం బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో కిషన్‌ ‌రెడ్డి వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా.. ఇదే విషయంపై కిషన్‌ ‌రెడ్డి స్పందించారు.బీజేపీలో గ్రూపులు ఉన్నాయని కాంగ్రెస్‌ ఎం‌పీ రేవంత్‌రెడ్డికి ఎలా తెలుసని ప్రశ్నించారు. తాను కేసీఆర్‌కు అనుకూలమని ప్రచారం చేసే వాళ్లను దేవుడే చూసుకుంటాడన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పనుల కోసం ఢిల్లీకి వచ్చే వారికి ఖచ్చితంగా సాయం చేస్తానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply