సిద్దిపేట స్థానిక విపంచి భవన్ లో మేజిషియన్ భాస్కర్ మేజిక్ ప్రదర్శన లో రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు, మునిసిపల్ చైర్మన్ రాజనర్సు, శాంతా బయోటెక్స్ ఫౌండర్ వర ప్రసాద్ రెడ్డి, సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ భాస్కర్ ప్రతిభ చూసాక అవార్డు ఎందుకు రాలేదా అనిపించింది.. వర ప్రసాద్ రెడ్డి పేదవారికి మందులను చౌక గా అందిస్తున్న వ్యక్తి.. భాస్కర్ లాంటి వ్యక్తులను ఆదరిస్తున్నారు.. ప్రతిభ ఉన్నవారిని ఆదరించటం అతని నైజం.. భారత సంస్కృతి ని ముందుకు తీసుకువెళుతున్న గొప్ప వ్యక్తి.. ఎదిగినా కొద్దీ … భాస్కర్ దేశ ఖ్యాతి పెంపొందిస్తాడనే నమ్మకం ఉంది. ప్రభుత్వ తరుపున అవార్డును అందించే ప్రయత్నం చేస్తాం… ఒలింపిక్స్ అవార్డు తీసుకు వస్తాడనే నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో మెగా మ్యాజిక్ షో ఏర్పాటు చేస్తాం… అని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఒక జిల్లా ఇంత గొప్పగా ఉంటుందా అనిపించింది. జాతీయ భావం కల్గిన నాయకుడు హరీష్ రావు.. మేజిక్ ప్రక్రియ ఉంది కానీ అవకాశం లేదనే ఉద్దేశ్యం తో భాస్కర్ ను ప్రోత్సాహించేందుకే అవకాశం కోసం ఇక్కడికి వచ్చాను. ఒలింపిక్స్ లో మేజిక్ కు ఒక్క పథకం లేదు. అంతర్జాతీయ అవకాశం కోసం మన అందరం ప్రయత్నించాలి. సరైన వ్యక్తి కి సరైన గుర్తింపు రావాలి. రాష్ట్ర అవార్డు లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో అవార్డు తీసుకు వచ్చే అవకాశం ఉంది..’అన్నారు.