Take a fresh look at your lifestyle.

జాగ్రత్తలు తీసుకుంటూ .. కొరోనాతో సహజీవనం ..!

రా•ష్ట్రంలో ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ ‌పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని వెల్లడించారు. హైదరాబాద్‌ ‌నగరంలో సిటీ బస్సులకు అనుమతి లేదనీ, అలాగే, ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను ఇప్పుడే అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ‌నగరంలో ఆటోలు, టాక్సీల నిర్వహణకు అనుమతిస్తున్నామనీ…అయితే కేవలం ముగ్గురు ప్రయాణికులతో మాత్రమే నడిపించుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ‌పొడిగింపు, కొరోనా నియంత్రణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్టీసీ నిర్వహణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ మే 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ‌పొడిగించాలని నిర్ణయించామనీ, రాత్రి పూట కర్ఫ్యూ యధాతథంగా కొనసాగుతుందని చెప్పారు. 1452 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్‌ ‌జోన్లలో ఉంటాయనీ, వారికి మందులు, నిత్యావసరాలు మాత్రమే ప్రభుత్వం డోర్‌ ‌డెలివరీ చేస్తుందని చెప్పారు. ఆ ప్రాంతాలు తప్ప మిగిలినవన్నీ గ్రీన్‌ ‌జోన్లేననీ, కొరోనాకు ఇప్పుడే మందు వచ్చే పరిస్థితి లేనందున కొరోనాతో కలసి జీవించాల్సిందేననీ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు సాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దనీ, లాక్‌డౌన్‌ను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు.

ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రతీ రోజూ శానిటైజ్‌ ‌చేస్తామనీ, మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈనెల 31 వరకూ మెట్రో రైలు సర్వీసులను నడిపించబోమన్నారు. కంటైన్మెంట్‌ ‌జోన్లు ఉన్న ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో దుకాణాలు తెరుచుకోవచ్చని చెప్పారు. సరిబేసి సంఖ్యలో మాత్రమే దుకాణాలు తెరవాలనీ, ఈ నిబంధనను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే, కట్టడి ప్రాంతాలలో మినహా మిగతా ప్రాంతాలలో సెలూన్లు ఓపెన్‌ ‌చేయవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ కామర్స్ ‌సంస్థలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వందశాతం పనిచేస్తాయన్నారు. అయితే, అన్ని విద్యా సంస్థలను మూసి వేయాలనీ, ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించాలనీ లేనట్లయితే, రూ. 1000 జరిమానా తప్పదన్నారు. అన్ని రకాల పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, తయారీ యూనిట్లు యధావిధిగా పనిచేస్తాయని వివరించారు. రాష్ట్రంలోని ఏ మతానికి సంబంధించిన ప్రార్థనలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. సినిమా హాళ్లు, బార్లు, క్లబ్బులు, పబ్బులు, స్విమ్మింగ్‌ ‌పూల్స్, ‌స్టేడియాలు, జిమ్ములు, పార్కులు, అమ్యూజ్‌మెంట్‌ ‌పార్కులు తెరిచే ప్రసక్తే లేదన్నారు. లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చాం కదాని ఎవరూ హంగామా చేయవద్దనీ, ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని స్పష్టం చేశారు. లేదంటే మళ్లీ లాక్‌డౌన్‌ ‌విధించే పరిస్థితి రావొచ్చనీ, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, చిన్న పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటికి రావొద్దనీ, త్వరలోనే ఈ మహమ్మారి నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply