Take a fresh look at your lifestyle.

కొరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టండి కేంద్ర కేబినెట్‌ ‌సెక్రటరీ రాజీవ్‌ ‌గౌబా

సూర్యాపేట, ఏప్రిల్‌ 25, ‌ప్రజాతంత్ర ప్రతినిధి):కరోనా వైరస్‌ ‌మహమ్మా రిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి నియంత్రించాలని కేంద్ర క్యాబినెట్‌ ‌సెక్రటరీ రాజీవ్‌ ‌గౌబా అన్నారు.శనివారం దిల్లీ నుండి కేంద్ర హ•మ్‌ ‌సెక్రటరీ, ఫైనాన్స్ ‌సెక్రటరీలతో కలిసి అన్నీ రాష్ట్రాల సిఎస్‌ ‌లు, డిజిపిలు, జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ ఉన్నతాధికారులతో వీడియో కాన్పరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు లాక్‌డౌన్‌ ‌నేపధ్యంలో ప్రజలు పూర్తిగా ఇండ్లకే పరిమతం అయ్యేల చర్యలు తీసుకోవాలని, కంటైన్మంట్‌ ‌ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా భారీ బందోబస్తు నిర్వహించాలని సూచించారు. అన్నీ రహదారులను మూసివేయాలని, సత్వర చర్యలు ఎప్పటి••ప్పుడు చేపట్టాలని అన్నారు. నిత్యావసర వస్తువులకు చెక్‌పోస్టుల వద్ద అనుమతులు ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవ సాయ పనులు, ఉపాధి పనులకు, అలాగే వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూడాలని తెలిపారు.

- Advertisement -

అనంతరం జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి మాట్లాడుతు జిల్లాలో వైరస్‌ అనుమానితులను వెంటనే గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్లలో ఉంచి, వారి శాంపిల్స్‌ను సేకరించి నిర్ధారణ పరీక్షల నిమిత్తం పంపించడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఇప్పటికి 83కేసులు నమోదు కాగా కొందరూ రీకవరీ అయి వచ్చారని వివరించారు. ఇప్పటికే పట్టణం మొత్తం రెడ్‌జోన్‌ ‌పరిధిలో ఉందని, కంటైన్మంట్‌ ‌ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటుచేసి ఆ ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్నీ మౌలిక వసతులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పారిశుద్ద్య పనులు, హైడ్రోక్లోరైడ్‌ ‌ద్రావణం పిచికారి వంటి పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను నియమించామని, వారు ఎప్పటి••ప్పుడు నివేదికలను అందజేస్తున్నారని అన్నారు. అనంతరం ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌ ‌మాట్లాడుతు జిల్లాలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల వద్ద గట్టి భద్రతతోపాటు నిఘా పెంచామని, డ్రోన్‌ ‌కెమెరాల ద్వారా ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు. అనవసరంగా ఎవరైనా రోడ్లపైకి వస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, వారి వాహనాలు సీజ్‌ ‌చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ వీడియో కాన్పరెస్స్‌లో డిఎంహెచ్‌ఓ ‌సాంబశివరావు, వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply