Take a fresh look at your lifestyle.

కందుల కొనుగోలుకు చర్యలు తీసుకోండి

‌ఖరీఫ్‌ ‌సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన వాణిజ్య పంటలైన కందులను కొనుగోలు కు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ‌వి పి గౌతమ్‌ ‌మార్కెటింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ ‌చాంబర్స్ ‌లో అధికారులతో పంట దిగుబడి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొదలగు అంశాలపై సమీక్షించి పటిష్టంగా నిర్వహించుటకు, తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5110 క్విటాళ్ల కందుల పంట దిగుబడి ఈ ఖరీఫ్‌ ‌సీజన్లో వచ్చే అవకాశం ఉందని, రైతులు ఇబ్బందులకు గురికాకుండా విక్రయిం చేలా కొనిగొలు కేంద్రాలను ఏర్పాట్లు చేయాలన్నారు. మార్చి చివరినాటికి రైతులు పండించిన దిగుబడిని మొత్తం కొనుగోలు చేయాలన్నారు . జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ మహబూబాబాద్‌ ‌కేసముద్రం లలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అదనంగా తొర్రుర్‌ ‌లో వచ్చే ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్‌, ‌మంత్రి తో ప్రారంభించనున్నట్ల ఆయన తెలిపారు.

ప్రతిరోజు రైతుల నుండి 200 క్విటాళ్ల కందులు వచ్చే అవకాశం ఉన్నందున దానికి సరిపడా కేంద్రాలు,సిబ్బంది, మెటీరియల్‌ ‌సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు విక్రయానికి తెచ్చే కందులలో తేమశాతం శాతం అధికంగా ఉంటే తిరస్కరించ కూడదని, అర బెట్టిన తర్వాత కొనుగోలు చేయాలన్నారూ. ఈ సమావేశంలో జిల్లా కోపరేటివ్‌, ‌మార్కెటింగ్‌, ‌వ్యవసాయ శాఖల అధికారులు ఇందిరా, సురేఖ,చత్రు నాయక్‌, ‌మార్కుఫెడ్‌ అధికారి, వ్యవసాయ మార్కెట్‌ ‌కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply