Take a fresh look at your lifestyle.

సర్వే సమయంలో జాగ్రత్తలు పాటించండి

వికారాబాద్‌: ‌సర్వే నిర్వహించే సమయంలో మెడికల్‌ ‌సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌మెతుకు ఆనంద్‌ ‌సూచించారు. బుధవారం వికారాబాద్‌ ‌మున్సిపల్‌ ‌పరిధిలోని రాజీవ్‌ ‌గృహకల్ప సమీపంలో కోవిద్‌ – 19 ‌పై సర్వే కోసం వెళ్తున్న అంగన్వాడీ, ఆశా వర్కర్స్, ఎఎన్‌ఎం‌లతో వికారాబాద్‌ ఎమ్మెల్యే మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే థర్మామీటర్‌తో స్వయంగా పరీక్ష చేయుంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వే చేసే సమయంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్స్, ఏఎన్‌ఎం‌లు సహా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఖచ్చితత్వం ఉండేలా సర్వే నిర్వహించాలని అన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలని అన్నారు.

Leave a Reply