Take a fresh look at your lifestyle.

జాగ్రత్తలు తీసుకుంటే.. కొరోనాతో భయం లేదు

మున్సిపల్‌ ‌సిబ్బందికి శానిటైజర్ల పంపిణీలో మంత్రి హరీష్‌రావు

మున్సిపల్‌ ‌సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని, జాగ్రత్తలు పాటిస్తూ విదులు నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కొరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని, అలాగన ఇభయాందోళనలు చెందాల్సిన అసవరం లేదన్నారు. మెదక్‌ ‌జిల్లాలోని చిన్న శంకరంపేటలోని ఓ ఫంక్షన్‌ ‌హాలులో మున్సిపల్‌ ‌సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు సానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్‌ ‌సిబ్బంది బాగుండాలన్న ఆలోచనతోనే సానిటైజర్స్ ఇస్తున్నారని అన్నారు. కొరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రు ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి. కరోనాకు ఉపాయాలున్నాయి. మాస్క్ ‌లేకుండా బయటకు రావద్దు. సబ్బుతో రోజుకు నాలుగైదు సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోవాలని సూచించారు. బయట నుంచి ఇంటికి వచ్చాక బట్టలు మార్చుకోవాలి, స్నానం చేసి వేరే దుస్తులు ధరించాలి.

harish rao

కొరోనా వైరస్‌ ‌నుంచి బయట పడాలంటే… రోజుకు మూడు సార్లు వేడి నీళ్లు తాగండి. ఫ్రిజ్‌ ‌నీళ్లు తాగవద్దన్నారు. జలుబు అయితే ముఖానికి ఆవిరిపట్టండి. పసుపు నీళ్లతో ఆవిరి పట్టండి. ప్రోటీన్‌ ఆహారం తీసుకోవాలి, కోడి గుడ్లు, పాలు వంటి ఆహారం తీసుకోవాలి. సిట్రస్‌ ఉన్న నిమ్మ, సంత్రా, బత్తాయి వంటి పండ్లు తీసుకోండని సూచనలు ఇచ్చారు. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కరోనా పట్ల భయం వద్దు, అలక్ష్యం వద్దు. జాగ్రత్తలు తీసుకోండి. మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుదాం. పారిశుధ్య పనులు పట్టణాల్లో, పంచాయతీల్లో ఆగకూడదని ప్రభుత్వం పట్టణ ప్రగతి, ప్లలె ప్రగతి కింద నిధులు విడుదల చేస్తోంది. కరోనా వచ్చినా ఈ నిధులు ఆపలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి ప్రభాకర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!