Take a fresh look at your lifestyle.

నోట్‌ ‌చేసుకోండి…!!

ఆ..అధికారులను వదిలిపెట్టరట
వేధించేటోళ్ళ పేర్లు నోట్‌ ‌చేకోవాలట
వచ్చే అధికారం కాంగ్రెసుపార్టీ దేనట

హస్తం నేతలు ఒంటి కాలిపై లేస్తున్నరు
పోలీసుల పై అగ్గై మండుతున్నరు

ఈ మాటలు దాటనే దాటవు కోటలు
సభికుల చప్పట్లకోసం కోసే కొతలు

పీఠం ఎక్కగానే ఇవి యాదిపెట్టుకోరు
బందోబస్తులేందే కాలు బైట పెట్టరు

జై తెలంగాణ అంటే చితక బాదినోళ్ళు
ఉస్మానియా పై ఉక్కుపాదం మోపినోళ్ళు

‘‘పోలీసు బాసులై వెలిగి పోతున్నరు
ఉద్యమకారులు బిత్తర పోతున్నరు’’!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply