రాత్రి
ఎక్కడెక్కడో పుట్టిన ఎన్నెన్నో జీవితాల నదుల్ని సముద్రంలా అక్కున చేర్చుకొని సంఘటితపరుస్తుంటుంది… మోడువారిన శిశిరపు హృదయోద్యానంలో అనుభూతుల పూలపరిమళాల్ని వెదజల్లుతూ ఆమనిలా విరబూస్తుంటుంది… వేదన మంచులో వణికే హృదయాన్ని వెచ్చదనం తరంగాల్లో చలిమంటలా వోలలాడిస్తుంటుంది… పగుళ్లుదీసిన బ్రతుకు పుడమిమీద ఓదార్పు మేఘమై చినుకు చినుకుగా కురుస్తూ సేదదీరుస్తుంటుంది… మమతల ఉలితో మహత్తర శిల్పిలా రాతిగుండెకు సైతం…