“తెలంగాణ ప్రజల్లో బలంగా ఉన్న తెలంగాణ వాదాన్ని, రాష్ట్ర ఆకాంక్షను రగల్చి 2001ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. నాలుగున్నర కోట్ల ప్రజల గొంతుకై ఉద్యమంలోకి దూకారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్లారు. తెలంగాణ కోసం కెసిఆర్ తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి పోరాడారని ఆయన పార్టీవారు చెప్తారు. ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నారు. కాంగ్రెస్, బిజెపిలేని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేసి దేశానికి కొత్త దిశానిర్దేశం చేయాలని ఆశిస్తున్నారు.”
సిఎం కేసీఆర్ సోమవారం నాటికి 65 ఏండ్లు పూర్తి చేసుకుని 66వ వసంతంలోకి అడుగిడుతున్నారు. అయితే, సిఎంగా కేసీఆర్‌కు ఇదీ ఆరో జన్మదినం. సిద్ధిపేట జిల్లా మారుమూల గ్రామమైన చింతమడకలో ఫిబ్రవరి 17, 1954లో మధ్య తరగతి రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. విద్యాభ్యాసం చింతమడక, దుబ్బాక, సిద్ధిపేట, హైదరాబాద్‌లలో కొనసాగింది. ఎంఏ చేసిన కేసీఆర్ తొలుత యువన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొట్టమొదటిసారిగా రాఘవాపూర్ పిఏసిఎస్ చై••ర్మన్‌గా ఎన్నికై…1983లో సిద్ధిపేట అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వోటమిని చవిచూశారు. ఇదే నియోజకవర్గం నుంచి 1985లో రెండోమారు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇక అప్పటి నుంచి ఆయనకు తిరుగేలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా, ఉప సభాపతిగా పని చేశారు.తరువాత ఎంపిగా గెలిచి కేంద్రంలో కార్మిక మంత్రి అయ్యా రు.తెలంగాణ ఉద్యమం వైపు మళ్లారు.కేసీఆర్ మంచి వ్యూహాకర్త. రాజకీయ చతురుడన్న పేరుంది. తెలంగాణ యాసతో మాట్లాడుతూ ప్రజలను బాగా ఆకట్టుకున్నారు. ఇది కెసిఆర్‌కు బాగా కలిసివొచ్చింది. 14ఏళ్లు అలుపెరగని పోరు చేసి సాధించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఆయన తొలి, మలి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టి ఇప్పటికి ఆరేండ్లు కావస్తున్నది. బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకు సాగుతున్నారు. ఎన్నిక ఏదైనా, విమర్శలు వెల్లువెత్తినా లెక్కచేయని మనస్తత్వం ఆయనది.
చూడటానికి బక్క పలచగా ఉండే కేసీఆర్ వ్యూహాలను రచించడంలో, ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అంటారు. 2001లో తెలుగుదేశం పార్టీకి, పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించాడు. ఒక్క రక్తం బొట్టు కూడా చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఆయన పార్టీవారంటారు. తెలంగాణ ప్రజల్లో బలంగా ఉన్న తెలంగాణ వాదాన్ని, రాష్ట్ర ఆకాంక్షను రగల్చి 2001ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. నాలుగున్నర కోట్ల ప్రజల గొంతుకై ఉద్యమంలోకి దూకారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్లారు. తెలంగాణ కోసం కెసిఆర్ తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి పోరాడారని ఆయన పార్టీవారు చెప్తారు. ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నారు. కాంగ్రెస్, బిజెపిలేని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేసి దేశానికి కొత్త దిశానిర్దేశం చేయాలని ఆశిస్తున్నారు.హరితహారం, నైతిక విలువలతో కూడిన పాఠ్యాంశాలు ప్రవేశపెట్టే విషయంలో సిఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్నది. కెసిఆర్ పథకాలను రూపొందించడంలో, అమలు చేయడంలో కూడా పట్టుదలతో ఉంటారు.గడిచిన ఆరేండ్లలో సిఎంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో.. రైతుబంధు పథకం, అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకం, ఆరోగ్య లక్ష్మి పథకం, కళ్యాణలక్ష్మి పథకం, చేనేత లక్ష్మి పథకం, ఆసరా పథకం, హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, షి టీమ్స్, ఐపాస్ తదితర పథకాలు ప్రజాదరణ పొందాయి. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ దఫా తెలంగాణ వ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటేందుకు టిఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కెసిఆర్ మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుందాం.
ఎ. సత్యనారాయణ రెడ్డి, ప్రజాతంత