Take a fresh look at your lifestyle.

మసీదుల్లో రహస్యంగా తలదాచుకుంటున్న తబ్లీగీ సభ్యులు

  • తనిఖీలకు ప్రభుత్వ అనుమతి కోరిన పోలీసులు
  • క్వారెంటయిన్‌ ‌నిబంధనలు ఉల్లంఘించడంతో వైరస్‌ ‌వ్యాప్తి

న్యూల్లీలో జరిగిన మత ప్రార్దనలకు హాజరయ్యేందుకు వచ్చిన సుమారు 600 మంది విదేశియులు ఢిల్లీ నగరం చుట్టుప్రక్కల ఉన్నటువంటి మసీదుల్లో తలదాచుకున్నారని గుర్తించారు. వారిని పట్టుకుని క్వాంరంటైన్‌ ‌కేంద్రాలకు తరలించడానికి తమకు అనుమతి కావాలని కోరుతూ పోలీసులు ప్రభుత్వాన్ని కోరారు. తబ్లీగీ జమాత్‌ ‌కార్యాలయం నుండి ఇప్పటికే సమారు రెండు వేల మందికి పైగా ప్రజలను క్వారంటైన్‌ ‌కేంద్రాలకు తరలించారు. కాగా నగర శివారుల్లోని మసీదుల్లో ఇంకా 600 మంది దాకా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు, కాబట్టి ఆ మసీదుల్లో తనికీలు చేసి వారిని క్వారంటైన్‌ ‌కేంద్రాలకు పంపిచేలా అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కొరోనా వైరస్‌ ‌గురించి ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా.. ప్రజల్లో పూర్తి అవగాహన రావడంలేదు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు.. ఇక్కడికి రాగానే క్వారంటైన్‌లోకి వెళ్లాలనే కనీస జాగ్రత్తలు పాటించడంలేదు. దీంతో ఈ పరిణామాలు ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. తమకు తాము ప్రమాదంలోకి జారిపోవడమే కాకుండా.. తోటి వారిని, ఇరుగు పొరుగు వారిని సైతం ముప్పులోకి తీసుకెళ్తున్నారు. న్నో కుటుంబాలు విదేశీ ప్రయాణికులను దాచి పెడుతుండగా.. ప్రయాణికులు కూడా ముందుకురావడానికి ఇష్టపడటం లేదు.స్థానికులు గుర్తించినా నేరుగా పోలీసులకు లేదా ఆరోగ్య శాఖాధికారులకు సమాచారం ఇవ్వడానికి వెనుకాడు తున్నారు.

స్థానిక నేతలకు సమాచారం ఇచ్చినా.. వారు పట్టించుకోవ డం లేదు. బస్తీల్లో ఎవరెవరు విదేశాల నుంచి వచ్చారు, ఎవరెవరి ఆరోగ్య పరిస్థితులెలా ఉన్నాయనే సమాచారాన్ని అధికారులకు అందించాల్సిన నేతలు బాధ్యత మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది ముదుర్లు.. విదేశాల నుంచి రాగానే ఇళ్లు వదిలి మరో బస్తీలో తాత్కాలిక నివాసముంటున్నట్లు తెలుస్తోంది. అవగాహన ఉన్నవారు, కుటుంబ సభ్యుల గురించి, ఇరుగు పొరుగువారి క్షేమం గురించి ఆలోచించేవారు.. భయపడాల్సిన అవసరమే లేదనే విషయాన్ని గుర్తించి నేరుగా ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. ఒకవేళ ఆలస్యంగా వైరస్‌ ‌వెలుగు చూస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనే విషయాన్ని అందరూ గుర్తించి ముందుకు రావాలని వైద్యాధికారులు కోరుతున్నారు. మరోవైపు •ం క్వారంటైన్‌లో ఉన్నవారు కొంతమంది రోడ్లపై తిరుగుతున్నారనే ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. విషయం తెలిసిన పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అయినా నిబంధనలు ఉల్లంఘించడంతో ఆరోగ్యశాఖ అధికారులు అంబులెన్స్‌లో క్వారంటైన్‌ ‌కేంద్రానికి తరలిస్తున్నారు. ఇకపోతే •ం క్వారంటైన్‌లో ఉండాల్సిన వారు మాటిమాటికీ బయటకు వస్తున్నారు. ఇలా •ం క్వారంటైన్‌ ఉల్లంఘించమే కాదు.. ఢిల్లీ మర్కాజ్‌ ‌ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్నాయి. దీంతో ఇతర రాష్టాల్రు నగరాల నుంచి వచ్చిన వారిపైనా స్థానికులు దృష్టిపెంచారు. వెంటనే పోలీసులకు, కొవిడ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌కు ఫోన్‌ ‌చేసి సమాచారం ఇస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply