Take a fresh look at your lifestyle.

ఎన్నికల సంస్కర్త శేషన్‌

‌నవంబర్‌ 10… ‌టి.ఎన్‌. ‌శేషన్‌ ‌వర్ధంతి

భారతదేశ ఎన్నికల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, రాజకీయ నాయకులకు, స్వార్థ అధికారులకు సింహ స్వప్నంగా నిలిచారు దివంగత భారత ఎన్నికల చీఫ్‌ ‌కమిష న్‌ ‌శేషన్‌. ‌భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చిన కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థనే మార్చేసి ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలు ఏమిటో సామాన్య ప్రజలకు సైతం కనువిప్పు కలిగించిన సంస్కర్త ఆయన. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఎన్నికలకు క్రమం, న్యాయం, సమగ్రతను తీసుకు రావడానికి ఆయన చేసిన కఠిన చర్యలకు గుర్తింపుగా 1996లో ప్రతిష్టాత్మక రామన్‌ ‌మగసెసే అవార్డు పొందారాయన. 1990 నుండి 1996 వరకు దేశంలోని 10వ ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా ఉన్న కాలంలో దేశ ఎన్నికల వ్యవస్థపై తన అధికారాన్ని ముద్రించ గలిగారు. తిరునెల్లాయ్‌ ‌నారాయణ అయ్యర్‌ ‌శేషన్‌ ‌కేరళలోని పాలక్కాడ్‌ ‌జిల్లా తిరునెల్లైలో డిసెంబర్‌ 15, 1932 ‌న జన్మించాడు. ఆయన పాఠశాల విద్యను బాసెల్‌ ఎవాంజెలికల్‌ ‌మిషన్‌ ‌హయ్యర్‌ ‌సెకండరీ స్కూల్‌ ‌నుండి, పాలక్కాడ్‌ ‌లోని ప్రభుత్వ విక్టోరియా కాలేజీ నుండి ఇంటర్మీడియట్‌ ‌పూర్తి చేశారు.

అతను మద్రాస్‌ ‌క్రిస్టియన్‌ ‌కాలేజీ నుండి భౌతిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ ‌సాధించారు. ఐఎఎస్‌ ‌పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పుడు మద్రాస్‌ ‌క్రిస్టియన్‌ ‌కాలేజీలో 3 సంవత్సరాలు ప్రదర్శన కారుడిగా పనిచేశాడు. శేషన్‌ ‌మొట్టమొదటి పోస్టింగ్‌ ‌తమిళనాడులోని మదురై జిల్లాలోని దిండిగల్‌లో సబ్‌ ‌కలెక్టర్‌గా. ఈ ప్రారంభ పోస్ట్‌లోనే, రాజకీయ నాయకుడి జోక్యం ఉన్నప్పటికీ చట్టాన్ని అమలు చేయడం ద్వారా శేషన్‌ ‌మొదట తన ధృఢ సంకల్ప పాత్రను చూపించారు. 1958 లో, శేషన్‌ ‌ప్రోగ్రామ్స్ ‌డైరెక్టర్‌గా, గ్రామీణాభివృద్ధి సచివాలయంలో డిప్యూటీ సెక్రటరీగా మద్రాస్‌కు తరలించబడి, 4 సంవత్సరాలు పదవి నిర్వహించారు. తరువాత, శేషన్‌ ‌డిసెంబర్‌ 1964 ‌లో తమిళనాడు లోని మదురై జిల్లా కలెక్టర్‌గా చేరాడు. తర్వాత కాలక్రమంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో అటామిక్‌ ఎనర్జీ విభాగంలో 1969 లో భారత ప్రభుత్వ సీనియర్‌ ‌పదవులలో మొదటి స్థానానికి శేషన్‌ ‌నియమితుడయ్యారు. అక్కడ అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌ ‌కార్యదర్శిగా పనిచేశారు. 1972- 1976 మధ్య పనిచేసిన సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంతరిక్ష విభాగంలో జాయింట్‌ ‌సెక్రటరీ పదవికి 1976 లో బదిలీ అయినప్పుడు ప్రజలను, డబ్బును, వనరులను నిర్వహించడంలో తనదైన శైలి ప్రదర్శించారు. తర్వాత శేషన్‌ ‌తమిళనాడుకు తిరిగి వచ్చి, రాష్ట్ర పరిశ్రమల మరియు వ్యవసాయ కార్యదర్శిగా పనిచేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రితో ‘‘ గొడవ’’ తరువాత(శేషన్‌ ‌స్వయంగా గుర్తుచేసుకున్నట్లు), రాజీనామా చేసి, ఆయిల్‌ అం‌డ్‌ ‌నేచురల్‌ ‌గ్యాస్‌ ‌కమిషన్‌ ‌సభ్యునిగా ఢిల్లీకి తిరిగి నియమించ బడ్డారు, ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ ఆహ్వానం మేరకు, అతను 1985 నుండి 1988 వరకు పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అయ్యారు. అలా కొనసాగడంతో పాటు, 1988 తరువాత రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా 1989 వరకు తాను నిర్వహించిన అంతర్గత భద్రతా కార్యదర్శిగా శేషన్‌ను రాజీవ్‌ ‌నియమించుకున్నారు. పది నెలల తరువాత, ప్రధాని గాంధీ తనపై ఉంచిన నమ్మకానికి రుజువుగా శేషన్‌ ‌కేబినెట్‌ ‌కార్యదర్శిగా ఎంపికయ్యారు. కొద్దికాలానికే, అప్పటి ప్రధాని చంద్ర శేఖర్‌కు న్యాయ మంత్రిగా ఉన్న మిత్రుడు సుబ్రమణ్యం స్వామి చొరవతో, శేషన్‌కు ముఖ్య ఎన్నికల కమిషనర్‌ ‌పదవిని ఇచ్చారు. శేషన్‌ ‌మొదట ఈ ప్రతిపాదనను తిరస్కరించి, రాజీవ్‌ ‌గాంధీని సంప్రదించి, అంగీకరించాలని నిర్ణయించుకుని, 1990 డిసెంబరులో పదవిని చేపట్టారు. శేషన్‌ ఎన్నో ఎన్నికల దుర్వినియోగాలను గుర్తించారు. సరికాని ఎన్నికల జాబితాల తయారీ, పోలింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేయడంలో తప్పిదాలు, బలవంతపు ఎన్నికలు, ప్రచారం చేయడానికి చట్టపరమైన పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేయడం, పోలింగ్‌ ‌బూత్‌లను లాక్కోవడానికి గూండాలను ఉపయోగించడం, అధికారాన్ని సాధారణంగా దుర్వినియోగం చేయడం వంటివి ఉన్నట్లు కనుగొన్నాడు. వెంటనే రాజకీయ ఒత్తిళ్లను ధిక్కరించి ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టాడు, తన రాజ్యాంగ అధికారాన్ని ప్రశ్నించమని ప్రభుత్వాన్ని సవాలు చేసే స్థాయికి కూడా వెళ్ళారు. శేషన్‌ ‌సంస్కరణలు ముఖంగా… ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి, సమగ్రతను కల్పించడం, ఓటర్లకు స్వేచ్ఛ అధికారం ఇవ్వడం, ఎన్నికల విధానాలను సంస్కరించడం, ఎన్నికల చట్టాలను మార్చడం. దేశంలో జాతీయ ఎన్నికలను అమలు చేసే అద్భుతమైన పనిలో, సిబ్బంది, ఉద్యోగులలో అధిక సంఖ్యాకులు విధులను తేలికగా తీసుకున్నారని శేషన్‌ ‌గమనించారు. 1992 లో కఠిన నిర్ణయాలు ప్రారంభించారు.

1993 లో తమిళనాడులో జరిగిన ఎన్నికలపై బ్యూరోక్రసీతో శేషన్‌కు గొడవలు తలెత్తాయి. తమిళ నాడులో భద్రతా దళాలను మోహరించాలని శేషన్‌ ‌కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. వాటిని పూర్తిగా ఉపయోగించు కోవాలని రాష్ట్రాన్ని ఆదేశించారు. ఈ ఉత్తర్వు ద్వారా శేషన్‌ ‌దేశ హోం మంత్రితో విభేదించారు. శేషన్‌ ఆదేశాన్ని అమలు చేయడానికి నిరాకరించి నప్పుడు, ఎన్నికల కమిషన్‌ అధికారాన్ని ప్రభుత్వం గుర్తించే వరకు దేశంలో ఎన్నికలు జరగవని శేషన్‌ ‌నిర్ణయించారు. మళ్ళీ, ఈ సమస్యను సుప్రీమ్‌ ‌కోర్టుకు పంపారు. తన అభిప్రాయాన్ని చెప్పిన తరువాత, ఈ వ్యూహాత్మక ఉపసంహరణ అతనికి ఓటర్ల దృష్టిలో ఘనతను సంపాదించింది. శేషన్‌ అధికారాలను తగ్గించడానికి, అక్టోబర్‌ 1993‌లో, పార్లమెంట్‌ ‌రాజ్యాంగాన్ని సవరించింది. ముఖ్య ఎన్నికల కమిషనర్‌తో అధికారాన్ని పంచుకోవడానికి ఇద్దరు అదనపు కమిషనర్లను చేర్చింది. ఎంఎస్‌ ‌గిల్‌ ‌మరియు జివిసి క్రిష్ణ మూర్తి, ఇద్దరూ ఘనులే. సుప్రీమ్‌ ‌కోర్టులో కొత్త నియామకాలను సవాలు చేస్తూ శేషన్‌ ‌తిరిగి పోరాడారు. ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్‌ ‌పనులపై చీఫ్‌ ‌కమిషనర్‌కు పూర్తి నియంత్రణ ఇస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఓటర్ల హక్కుల గురించి ప్రజలలో అవగాహన కల్పించడంలో శేషన్‌ ‌సఫలమైనారు. చట్టబద్దమైన ఓటర్లందరికీ ఫోటో ఐడెంటిఫికేషన్‌ ‌కార్డులను జారీ చేయాలని 1992లో శేషన్‌ ‌ప్రభుత్వానికి పిలుపు నిచ్చారు. ఈ చర్య అనవసరమని, ఖరీదైనదని రాజకీయ నాయకులు తీవ్రంగా నిరసించారు. ప్రభుత్వం చర్యల కోసం 18 నెలలు వేచి ఉన్న తరువాత, ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోతే, జనవరి 1, 1995 తరువాత ఎన్నికలు జరగవని శేషన్‌ ‌ప్రకటించారు. శేషన్‌ ‌పట్టు బట్టడంతో, ప్రభుత్వం ఐడి కార్డులు ఇవ్వడం ప్రారంభించింది.

ఎన్నికల ప్రక్రియలో చట్టం అమలులో కఠినమైన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేశారు. అర్హత కలిగిన ఓటర్లందరికీ ఓటరు ఐడిల జారీ, ఎన్నికలలో అభ్యర్థుల ఖర్చుపై పరిమితి, ప్రగతిశీల, స్వయంప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్‌… ఎన్నికలను నిర్వహించే రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ఓటింగ్‌ ‌యంత్రాలు, ఎన్నికల అధికారులను వినియోగించాడు. ఓటర్లకు లంచం ఇవ్వడం లేదా బెదిరించడం, ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ, ప్రచారం కోసం అధికారిక యంత్రాల ఉపయోగం, ఓటర్ల కుల లేదా మత భావాలకు విజ్ఞప్తి, ప్రార్థనా స్థలాలను ప్రచారానికి ఉపయోగించడం, ముందస్తు వ్రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్‌స్పీకర్లు, అధిక వాల్యూమ్‌ ‌స్పీకర్లు ఉపయోగించడం, తదితరాలను నియంత్రించే కఠిన చర్యలు గైకొన్నాడు. 1997లో భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసి కేఆర్‌ ‌నారాయణన్‌ ‌చేతిలో ఓడిపోయారు. 10 నవంబర్‌ 2019‌న (వయసు 86) చెన్నైలో మరణించారు.

– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440585494

Leave a Reply