Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌-‌మోడీ ఇద్దరూ తోడు దొంగలే

  • అసమర్థ పాలన వల్ల కల్లాల్లోనే వడ్లు
  • రైతులకు అండగా ఉన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం
  • చేతకాకుంటే రూ.10 వేల కోట్లు ఇవ్వు కేసీఆర్‌
  • ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి చరిత్ర ఉంది..కెసిఆర్‌కు లేదు
  • రెండు రోజుల ‘వరి దీక్ష’లో టీపిసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి
  • మిల్లర్లతో కేసీఆర్‌ ‌కుమ్మక్కు..వరి రైతులు నష్ట పోడానికి కెసిఆరే కారణం
  • అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమయ్యారు
  • 60 లక్షల టన్నులకు 8 లక్షలు కూడా సేకరించలేదు
  • పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి
  • రైతులతో పెట్టుకున్నవాడు మునగక తప్పదు: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి

ముషీరాబాద్‌, ‌నవంబర్‌ 27(‌ప్రజాతంత్ర విలేఖరి) : కెసిఆర్‌, ‌మోడీ వేరు వేరు కాదు ఇద్దరు తోడు దొంగలేనని టీపిసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. కెసిఆర్‌ ‌మోడీతో కూడి రైతులను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు ఆలస్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్క్ ‌ధర్నా చౌక్‌ ‌వద్ద ‘వరి దీక్ష’ పేరుతో రెండు రోజుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..రైతులు పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. వ్యవసాయ దండుగ కాదు పండుగ చేస్తా అన్న సన్యాసి కెసిఆర్‌ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండటంతో కల్లాల వద్దే రైతులు గుండె ఆగి చనిపోతున్నారన్నారు. ప్రతి వస్తువుకు తయారు చేసిన వాడే ధర నిర్ణయిస్తే రైతు పంటను దలారీ ధర పెడ్తున్నాడన్నాడన్నారు. కమీషన్‌ల కోసమే కాంట్రాక్టర్లు అని, రైతుల భూములు గుంజుకొని కెసిఆర్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌లు కట్టుకున్నాడన్నారు. కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌రైతులకు అండగా వున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని, గోడౌన్లు, ఎఫ్సీఐ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీ అన్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు పెరగకుండా నియంత్రించింది కాంగ్రెస్‌ ‌పార్టీ అన్నారు. కెసిఆర్‌కు చరిత్ర లేదు, కాంగ్రెస్‌ ‌పార్టీకి చరిత్ర వుందన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి కానీ అసమర్థ పాలన వల్ల కల్లాల్లోనే వడ్లు వున్నాయన్నారు. దుర్మార్గపు కెసిఆర్‌ ‌వడ్లు కొనక రైతులను ఏడిపిస్తున్నాడన్నారు. సిఎం కేసీఆర్‌ ‌ఢిల్లీకి వెళ్లి ఎవరిని కలవ కుండా వచ్చి ఫామ్‌ ‌హౌస్‌ ‌కే పరిమితమయ్యాడన్నారు. రైతుల కోసం ఇందిరా పార్క్ ‌వద్దకు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కదలి రావాలని పిలుపునిచ్చారు. కెసిఆర్‌ ‌వడ్లు కొనకుంటే పార్లమెంట్‌లో మోడీని నిలదీస్తామన్నారు. ప్రభుత్వానికి చేత కాకుంటే రూ.10 వేల కోట్లు కాంగ్రెస్‌ ‌పార్టీకి ఇవ్వాలన్నారు. చివరి గింజ వరకు కొంటాం ప్రతి క్వింటాల్‌కు 500 బోనస్‌ ‌కూడా ఇస్తామన్నారు. ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ మోడీ, కెసిఆర్‌లు కలిసి రైతులను మోసం చేస్తున్నారన్నారు. దేశంలో రాష్ట్రంలో 50 నుండి 60 శాతం జనాభా వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్నాయన్నారు.

vari deeksha

ఆగస్ట్ ‌నెలలో 5 కోట్ల టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రం ఒప్పందం జరిగిందని, కేంద్రం 40 లక్షల టన్నుల బియ్యం సేకరణకు టార్గెట్‌ ‌పెట్టిందన్నారు. అంటే 60లక్షల టన్నుల వడ్లు సేకరించాలన్నారు. కానీ ఇప్పటి వరకు 8 లక్షల టన్నులు కూడా సేకరించలేదన్నారు. పంజాబ్‌లో ఇప్పటికే కోటి 10లక్షల టన్నులు చేకరించిందన్నారు. మన కంటే చిన్న రాష్ట్రాలు కూడా 40 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరిస్తున్నాయన్నారు. వరి రైతులు నష్ట పోడానికి కెసిఆరే కారణమన్నారు. అకాల వర్షాలు అన్నదాతలు ఆగమయ్యారన్నారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు, అధికారులు మోసం చేశారన్నారు. వానలకు తడిసి వడ్లు మొలకలెత్తయన్నారు. కెసిఆర్‌ ‌మిల్లర్లతో కుమ్మకయ్యారన్నారు. రబీ పంటలపై ఆంక్షలు పెట్టొద్దు అన్నారు. పార్లమెంట్‌ ‌సమావేశంలో వరి రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. అన్ని విధాలుగా కెసిఆర్‌ ‌తెలంగాణ రైతులను మోసం చేస్తున్నడన్నారు. ఛత్తీస్‌ ‌ఘడ్‌లో వరికి క్వింటాల్‌కి 500 బోనస్‌ ఇస్తుందన్నారు. ధనిక రాష్ట్రంలో ఎందుకు రైతులపై చిన్న చూపని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, పంట భీమ ఇవ్వకుండా కెసిఆర్‌ ‌మోసం చేస్తున్నాడన్నారు.

కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..దసరా దీపావళి పండగలు చేసుకోకుండా రైతులు కల్లాల దగ్గర పడుకుంటున్నారన్నారు. పనికిరాని మంత్రులను తీసుకుని కేసీఆర్‌ ‌ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. మోడీ అపాయింట్‌ ‌మెంట్‌ ‌తీసుకోని కేసీఆర్‌ ‌ఢిల్లీ ఎందుకు వెళ్లిండని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మానవత్వం లేదని, ధనార్జనే ఆయన ధ్యేయమన్నారు. రూ.20 వేల కోట్లు పెడితే రైతుల ధాన్యం మొత్తం కొనొచ్చన్నారు. కేసీఆర్‌ ‌పెద్ద మోసగాడని కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద గోల్‌ ‌మాల్‌ ‌జరిగిందన్నారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దొంగల ముఠాలా మారి దోచుకుంటున్నారన్నారు. నిజామాబాద్‌లో ఓ ఎమ్మెల్యే రూ.12 కోట్ల కారులో తిరుగుతున్నాడన్నారు. దొంగల ముఠాకు మేస్త్రీలా కేసీఆర్‌ ఉన్నాడన్నారు.

vari deeksha

రెండేళ్లలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులతో పెట్టుకున్నవాడు మునగక తప్పదన్నారు. ముందు పండించిన పంటను కొని తర్వాత యాసంగి పంట గురించి మాట్లాడాలన్నారు. కేసీఆర్‌ను ఆ దేవుడు శిక్షిస్తాడన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా రైతులను కాపాడుకోవాల్సిన భాధ్యత కాంగ్రెస్‌ ‌పార్టీపై ఉందన్నారు. కేసీఆర్‌ ‌ప్రధానమంత్రి అపాయింట్‌ ‌మెంట్‌ అడగలేదన్నారు. వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి ఉచిత కరెంట్‌ ఇస్తే కరెంట్‌ ‌తీగలమీద బట్టలు ఆరేసుకోవాలా అని చంద్రబాబు ఎద్దేవా చేసాడని, వైఎస్‌ ఉచిత కరెంట్‌ ఇచ్చి చూపెట్టాడన్నారు. ఇందిరాగాంధీ చేయలేని ధైర్యాన్ని సోనియా గాంధీ చేసి తెలంగాణ ఇచ్చిందన్నారు.

అవసరం లేని కొత్త సెక్రటేరియట్‌ ‌కడుతున్న కేసీఆర్‌, ఇప్పుడు ఆ డబ్బులు రైతులకు ఉపయోగపడేవి కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌లా ఢిల్లీ వెళ్లి ఇంట్లో పడుకోమని, ప్రధాని ఆఫీసు ముందు కూర్చుంటామన్నారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు పని ఏమైందో అందరూ చూస్తున్నారన్నారు. ఓ వైపు రైతులు ఇబ్బందులు పడుతుంటె టిఆర్‌ఎస్‌ ‌మంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు క్యాంపులకు పోతున్నారన్నారు. కోదండ రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల నుంచి కల్లాల్లో ఉన్న వరిధాన్యం కొనాలని డిమాండ్‌ ‌చేశారు. తడిసిన ధాన్యం కూడా కొనాల్సిందేనన్నారు. మొలకెత్తిన ధాన్యం బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్‌ ‌హయాంలో మొలకెత్తిన, తడిసిన ధాన్యం కూడా కొన్నామన్నారు. 2020లో నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఈ దీక్షలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలు వీహెచ్‌, ‌పొన్నాల లక్ష్మయ్య, సీతక్క, మహేశ్వర్‌ ‌రెడ్డి, అన్వేష్‌ ‌రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply