50 శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయం
7న ఇందిరాపార్కు వద్ద ధర్నా, 11న ఖమ్మంలో రైతు ర్యాలీ
కోర్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
త్వరలో జరుగనన్ను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై టీ కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా 50 శాతం సీట్లను బీసీలకు ఇవ్వాలని నిర్ణయించింది. బుధవారం ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మాణికం ఠాగూర్ ఆధ్వర్యం లో గాంధీభవన్ వేదికగా కోర్ కమిటి సమావేశం జరిగింది .ఈ సమావేశం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , ఎమ్మెల్యే లు జగ్గారెడ్డి , సీతక్క ,మాజీ సిఎల్పీ నేత జానారెడ్డి ,ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ లు పొన్నం ప్రభాకర్ , కుసుమ కుమార్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ హాజరైయ్యారు.ఈ సమావేశం లో పలుకీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ …హైద్రాబాద్ లో గ్రేటర్ పరిధిలో బి.సి లకు న్యాయ పోరాటం చేయాలనీ అలాగే ఈ నెల 7 న మహిళలు, దళితులపై దాడులకు నిరసన గా ఇందిరాపార్క్ ధర్నా,11న ఖమ్మం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ట్రాక్టర్లు తో రైతు ర్యాలీ ,12 న జిల్లా కేంద్రాల్లో రైతు కోసం దీక్ష రైతు సమస్యలపై జిల్లా కేంద్రాలలో దీక్షలు ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దింతో పాటు రానున్న గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేసే అభ్యర్థుల నుండి దరఖాస్తు రుసుము తీసుకోవాలని నిర్ణయించారు .