Take a fresh look at your lifestyle.

జాతీయవాద దృక్పథానికి ప్రతీక విశ్వభారతి

ఆధ్యాత్మిక జాగృతి నుంచి మానవాళి లబ్ది పొందాలన్నదే లక్ష్యం
శతాబ్ది ఉత్సవాల్లో వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని మోడీ

విశ్వభారతి విశ్వవిద్యాలయం స్వాతంత్యోద్య్రమ కాలంలో గురుదేవులు రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ ‌మార్గదర్శకత్వంలో భారత దేశ జాతీయవాద దృక్పథానికి ప్రతీకగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత దేశపు ఆధ్యాత్మిక జాగృతి నుంచి యావత్తు మానవాళి లబ్ది పొందాలని గురుదేవులు టాగూర్‌ ఆకాంక్షించారన్నారు.

ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ ‌విజన్‌ ‌కూడా ఈ దృక్పథం నుంచే ఉత్పన్నమైందన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని శాంతి నికేతన్‌లో ఉన్న విశ్వ భారతి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా గురువారం పాల్గొన్నారు. విశ్వ భారతి విశ్వవిద్యాలయం స్థాపనకు దారి తీసిన పరిస్థితులను మనం గుర్తు చేసుకోవాలని మోదీ అన్నారు. విశ్వ భారతి విశ్వవిద్యాలయం వందేళ్ళ ప్రయాణం చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. భారత మాత కోసం రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ ఆలోచనలు, విజన్‌, ‌కఠోర శ్రమలకు నిజమైన రూపం విశ్వభారతి విశ్వవిద్యాలయమని చెప్పారు. భారత దేశానికి ఇది ఆరాధనీయమైన, ఆదరణీయమైన ప్రదేశమని తెలిపారు. గురుదేవ్‌ ‌టాగూర్‌ ‌కలలకు రూపమివ్వడానికి దేశానికి ఈ ప్రదేశం నిరంతరం శక్తినిస్తుందన్నారు. కేవలం బ్రిటిష్‌ ‌పరిపాలన మాత్రమే కాదని, వందల సంవత్సరాల ఉద్యమ చరిత్ర, సుసంపన్నమైన మన సిద్ధాంతాలు ఈ విశ్వవిద్యాలయం స్థాపన వెనుక ఉన్నట్లు తెలిపారు.

Leave a Reply