- 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా కొత్త భవన నిర్మాణం
- దేశ ప్రజలందరూ గర్వించాల్సిన క్షణం..సుదినం
- కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీ
ఇప్పుడు వాళ్లందరూ చూస్తూ ఉండగానే ప్రజాస్వామ్య భారతం అద్భుతంగా పురోగమిస్తోంది. మాగ్నా కార్టా కంటే ముందే భారతదేశంలో హక్కుల కోసం ప్రయ్నతాలు జరిగాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి అంతకు ముందు నుంచే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. దేశ ప్రజాస్వామ్య ప్రస్థానానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. అప్పటి నుంచే ప్రజాస్వామ్య ప్రయాణానికి బాటలు వేశారు. 10వ శతాబ్దంలో తమిళనాడులోని ఓ గ్రామంలో పంచాయతీ వ్యవస్థ గురించి సవివరంగా పేర్కొన్నారు. రుగ్వేదంలో కూడా ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావన ఉంది. భారతదేశం సమాజ మూలాల్లోనే ప్రజాస్వామ్యం విధానాలు ఉన్నాయి. భారత దేశ తత్వ చింతన అంతా ప్రజాస్వామ్యం ఆధారంగానే సాగింది. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలకు మన దేశం పురిటిగడ్డ. దేశ ప్రజాస్వామ్య ప్రయాణం ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా సాగుతోంది. దేశంలో ప్రతి ఎన్నికకూ వోటింగ్ శాతం పెరుగుతూ వొస్తోంది. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంపై మాత్రం ఎవరికీ వ్యతిరేకత లేదన్నారు. సభ లోపల, బయటా సంవాదాలు దేశం కోసమే. మన ప్రతి నిర్ణయంలో ‘దేశం మొదట’ అన్న భావనే ఉండాలి. పార్లమెంట్ నూతన భవనం కూడా ఒక దేవాలయమే. ఈ దేవాలయంలో ప్రాణప్రతిష్ట చేయాల్సింది రానున్న ప్రజాప్రతినిధులే అని ప్రధాని మోదీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం.. పాత, కొత్త సహజీవనానికి ఉదాహరణగా నిలుస్తుందన్నారు.