Take a fresh look at your lifestyle.

నవకృషి స్వచ్చంద సేవా సంస్ద ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్దులకు స్వేటర్స్ ‌పంపిణీ

Sweaters distribution to needy students under the auspices of Nawakrishiతాండూర్‌ ‌బెల్లంపల్లి పట్టణానికి చెందిన నవకృషి స్వచ్చంద సేవా సంస్ద ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్దులకు స్వేటర్స్ ‌పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెన్నెల ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్దులకు అందజేయడం జరిగింది. ఘన్పూర్‌లో 55 మంది విద్యార్దులకు ఇవ్వడం జరిగింది. జన్కాపూర్‌ ‌మండల్‌ ‌పరిషత్‌ ‌ప్రాథమిక పాఠశాలలో 52 మంది విద్యార్దులకు అందజేయడం జరిగింది. బోయపల్లి బోర్డులోని వేణునగర్‌ ‌వద్ద సేవా జ్యోతి శరణాలయంలో పిల్లలకు స్వేటర్స్‌తో పాటు మిఠాయిలు అందజేయడం జరిగింది. ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు విద్యార్దులతో కలిసి జరుపుకోవడం చాల సంతోషంగా ఉందని నవకృషి సంస్ద ప్రతినిధులు జితేందర్‌ ‌ప్రజాపథ్‌ ‌తెలిపారు. ఈ కార్యక్రమంలో అరవింద్‌ ‌సోని,రవిరాజా,రావన్‌,అనిల్‌,‌శ్రావణ్‌,‌దరావాణి,సమీర్‌ ‌ఖాన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Tags: thandur bellampalli,‌ navakrushi,‌ govt schools,‌ sweaters distribution

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply