Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ‌పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసిన స్వర్గం రవి

ఈ నెల 30న సిఎం కెసిఆర్‌ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌లో చేరిక

కమలాపూర్‌, ‌జూలై 28 (ప్రజాతంత్ర విలేకరి): కాంగ్రెస్‌ ‌పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనా మా చేస్తున్నట్లు హుజురాబాద్‌ ‌నియోజకవర్గ కీలక నేత స్వర్గం రవి బుధవారం ప్రకటించారు. దీంతో ఉప ఎన్నికల్లో హుజురాబాద్‌ ‌నియోజక వర్గంలో బిసి సామాజిక వర్గానికి చెందిన స్వర్గం రవి కాంగ్రెస్‌ ‌పార్టీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ ‌పార్టీకి మరో పెద్ద షాక్‌ ‌తగిలిందని తెలుస్తోంది. కమలాపూర్‌ ‌మండలం ఉప్పల్‌ ‌గ్రామానికి చెందిన స్వర్గం రవి తన ఇంటి ఆవరణలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వర్గం రవి మాట్లాడుతూ  గత 15 సంవత్సరాల క్రితం డాక్టర్‌ ‌వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ‌పార్టీ లో చేరనన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరి ఇప్పుడు తాను సామాన్య కార్యకర్తనని, అంచెలంచెలుగా ఎదుగుతూ టిపిసిసి ఆర్గనైజింగ్‌ ‌సెక్రటరీగా పార్టీకి ఎన్నో సేవలు చేశానని అన్నారు.  నియోజకవర్గంలోని ఏ గ్రామం నుండి ఆర్థిక సహాయం వైద్య సహాయం వివిధ కులస్తుల సంఘాల భవనాల నిర్మాణాలకు ఆర్థిక సహాయం చేశామన్నారు.

తానం బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడనని, బీసీల అంటే ఎంతో ఆప్యా యంగా ఉండే వాడిని, వారికి ఎలాంటి సహా యం చేయాలని అడిగితే అలాంటి సహాయాలు చేశానని అన్నారు. పారిశ్రామిక వేత్తగా రాష్ట్రంలో ఎంతో పేరు సంపాదించుకున్నానని, పుట్టిన గ్రామంతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని కాంగ్రెస్‌ ‌పార్టీయే కాకుండా ఏ పార్టీకి చెందిన వారినైనా తన తాను అక్కున చేర్చుకొని, ఎన్నో సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ప్రస్తుత రాజకీయాలను జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ ‌పార్టీ నుండి తన సభ్యత్వాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డిని రాజీనామా పత్రం ద్వారా కోరుతున్నానని అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌చేస్తున్న అభివృద్ధి పనులు, ఎన్నో పథకాలను ఆకర్షితులై టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యానని ఈనెల 30న సాయంత్రం నాలుగు గంటలకి సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో హుజరాబాద్‌ ‌నియోజకవర్గంలోని తన అనుచరులతో చేరుతానని ఆయన ప్రకటించారు.   ఈ సమావేశంలో ఉప్పల్‌ ‌మేజర్‌ ‌గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎ‌ర్రబెల్లి దేవేందర్‌ ‌రావు, మాజీ జెడ్పి టీసీ సభ్యుడు మారపల్లి నవీన్‌ ‌కుమార్‌ , ‌మాజీ సర్పంచ్‌ ‌దేశిని శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌నాయకులు నాయినేని తిరుపతిరావు తూర్పాటి పైడి , శ్రీధర్‌ ‌రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply