Take a fresh look at your lifestyle.

మీ వల్లే స్వరాష్ట్ర కల సాకారమయింది..!

ముఖ్యమంత్రి కేసిఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు 
తెలిపిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు
దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది.. భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుందని ముఖ్య మంత్రి కేసీఆర్ కు జన్మ దిన శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి హరీష్ రావు మంగళ వారం ప్రకటన విడుదల చేసారు.  “మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది. 
మీరు కారణజన్ములు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు.
తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..” అని పేర్కొన్నారు.

Leave a Reply