కన్నీటిలో..
కలువలు పూచేనా..
కాలానికి..
ఋతువులు మారేనా..
గాత్రానికి..
స్వరములు దొరికేనా..
పాటలకూ..
ఊటలు ఊరేనా..
బాలూలా..
గళాలు పుష్పించేనా..
పాడుతా తీయగా అన్న
పాటల పూదోట..
శృతీ లయల గతి
తెలుగు పాట ఖ్యాతి
సప్త స్వరాల బాలు పాట
ఈ దివిలో విరిసిన పారిజాతం
సెలవుంటూ..
స్వర వీణ మీటుటకై
స్వర్గమనే మరో దివికేగింది..
ధృవ తారగ తళుకులీన..
గగన సిగలో నిలిసింది..
(గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారికి కవితాక్షర పుష్ప నీరాజనం…)
-పాల్వంచ హరికిషన్, రామన్నపేట, యాదాద్రి భువనగిరి, 9501451780.