
అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ స్వామివారు భక్తులకు మత్య్సావతారంలో దర్శనమిచ్చారు. రామలయం నుంచి స్వామివారిని మత్య్సావతారం రూపునిగా తీర్చిదిద్ది పల్లకి ద్వారా కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు తీసుకొచ్చారు. మేళ తాళాలు, భక్త జన సందోహం నడుమ స్వామివారు పల్లకీలో వేంచేస్తుంటే భక్తులు చూసి తరించారు. స్వామివారి పల్లకీ ముందు భక్త భజన బృంధాలు కోలాటాలు చేస్తూ జయ రామ జయ రామ జయజయ రామా అంటూ కీర్తనలు ఆలపిస్తూ అందుకు తగ్గట్లుగా నృత్యాలు చేశారు. ప్రత్యేక వేదికపై ఆసీనులైన స్వామివారిని కొలిచేందుకు భక్తులు బారులు తీరారు.
శ్రీమహావిష్ణువు ధరించిన అవతారంలో మొట్టమొదటి అవతారం మత్య్సావతారం ఈ అవతారానికి సంబందించిన రెండు గాధలు పురణాల్లో ఉన్నాయి. ఒకటి జ్ఞాన విధులైన వేదాలను బ్రహ్మనుండి అపహరించి సముద్రంలో దాగివున్న సోమకాసురుని సంహరించడానికై మత్య్సావతారం ధరించి వేధాలను ఉద్దరించడం జరిగింది. రెండవది జలప్రళయం నుండి నావలో ఉన్న వైవస్వత మనువులు ,సప్తరుషులును ,సృష్టికి అవసరమైన విత్తనాలను,ఔషదాలను రక్షించాడు. ఈ అవతారాన్ని పూజించుట వలన కేతు గ్రహ భాధలు తొలగుతాయి.
అలరించిన కోలాట నృత్యాలు– మత్య్సావతారంలో ఉన్న స్వామి పల్లకీలో తిరువీధి సేవకు బయలు దేరుతుండగా ముందు భాగంలో భజన బృంధం మహిళలు కోలా ప్రదర్శన చేశారు. తిరువీధి సేవలు పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు స్వామివారి ప్రసాదాలు అందించారు. తిరువీధి సేవలో భక్తులు స్వామికి మంగళనీరా•నాలు పట్టారు. శనివారం శ్రీ స్వామివారు కూర్మావతారంలో భక్తులకు దర్మనమివ్వనున్నారు. ముక్కోటి కాంతులతో రామాలయం – ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారా మచంద్రస్వామి వారి ఆలయం విద్యుత్ కాంతులతో శోభయమానంగా మా రింది. జనవరి 5న తెప్పోత్సవం, 6వ తేదిన ఉత్తర ద్వార దర్శనం ఉండటంతో ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు కూర్మావతార కార్యక్రమాలు: ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు పారాయణ, డాక్టర్ కమలారాజశేఖర్ బృందం భద్రాచలం వికాస తరంగిణి , 2 గంటల నుండి 4గంటల వరకు హరికథ భద్రాద్రి వైభవం, నూకలయజ్ఞ సత్యనారాయణ హైద్రాబాద్ వారిచే, 5 గంటల నుండి 5.30 వరకు భరతనాట్యం భువనకృతి ,పుత్తూరు వారిచే , 5.30 నుండి 6గంటల వరకు కూచిపూడి నాట్యం టి శర్వాణి కార్తీక హైద్రాబాద్ వారిచే , 6 గంటల నుండి 6.30 వరకు కూచిపూడి నాట్యం, సురేఖ బృందం హైద్రాబాద్ వారిచే, 6.30 నుండి 7 వరకు బహురూపాధారణ మైపాడు రాజు నెల్లూరు వారిచే, 7 గంటల నుండి 8 గంటల వరకు కూచిపూడి నృత్యం పి.వందన తాడిపత్రి వారిచే , 8 గంటల నుండి 8.30 వరకు కూచిపూడి నృత్యం గీతాగణేషన్ సికింద్రాబాద్ వారిచే, 8.30 నుండి 11 గంటల వరకు పౌరాణిక నాటకం నిబాడని సుబ్బరాజు, సుమిత్ర యూత్ అసోసియేషన్ మదిర వారిచే నిర్వహించబడనున్నాయి.
Tags: adhyayanotsavalu, bhadadri temple , sriramachandrulu , kurmavathara , programmes