Take a fresh look at your lifestyle.

స్వామివారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ ‌ఖరారు

ఏప్రిల్‌ 13 ‌నుండి 27వరకు రాములవారి బ్రహ్మోత్సవాలు
21న శ్రీ సీతారాముల తిరు కల్యాణ మహోత్సవం – 22న మహాపట్టాభిషేకం
: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీస్వామివారి తిరుకల్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను దేవస్థానం వైదిక కమిటి ఖరారు చేసింది. 13 నుండి 27 వరకు వసంత పక్షప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహోత్సవాలు నిర్వహించనున్నారు. 21వ తేది బుధవారం నాడు శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం 22వ తేది గురువారం మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. 13వ తేది ఉగాది కావడంతో అదేరోజున బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు స్వామివారి తలంబ్రాలు కూడ కలపనున్నారు.

17వ తేది శనివారం సాయంత్రం మృత్సం గ్రహణం వాస్తు హోమం అంకురాపనం, 18వ తేది షష్టి ఆదివారం ఆర్ధ్ర శ్రీభగవత్‌ ‌రామనుజ జయంతి ఉదయం శ్రీరామరాజ్య చార్య స్వామివారిక స్నపన తిరుమంజర గరుడ ధ్వజపటన ,  సాయంత్రం గరుడ ధ్వజ పటాకావిష్కరణం గరుడ ధ్వజాదివాస, 19వ తేది సప్తమి పురస్వసు సోమవారం చక్రవర్తి తిరుమగ నార్‌ ‌తిరునక్షత్రం , ఉదయం అగ్ని ప్రతిష్ట ధ్వజారోహనము, 20వ తేది అష్టమి మంగళవారం నాడు ఉదయం యాగశాల పూజ చతు: స్థానార్చానము, రాత్రి గరుడ వాహన ఎదుర్కోలు ,21 నవమి బుధవారం శ్రీరామనవమి శ్రీసీతారాముల తిరుకల్యానమహోత్సవము, సాయంత్రం శ్రీరామ పునర్వసు దీక్షా ప్రారంభము, రాత్రి చంద్ర ప్రభ వాహనసేవ, 22వ తేది దశమి గురువారం ఉదయం మహాట్టాభిషేకం , రాత్రి రధసేవ , 23వ తేది సర్వ ఏకాదశి శుక్రవారం ఉదయం చతు: స్థానార్చన, రాత్రి సమయము హంసవాహన సేవ , 24వ తేది ద్వాదశి శనివారం ఉదయం చతు: స్థానార్చన రాత్రి తెప్పోత్సవం చారోత్సవము, 25 త్రయోధవి ఆదివారం చతు: స్థానార్చన రాత్రి ఊజ్వల్‌ ఉత్సవము, 26వ తేది చతుర్ధశి సోమవారం చిత్తా నక్షత్రం ఉదయం వసంతోత్సవం , సుదర్శన హోమం , సాయంత్రం హవనం, సేవ, 27వ తేది పూర్ణిమ మంగళవారం ఉదయం చక్రతీర్ధము, సాయంత్రం 6 గంటలక పూర్ణాహుతి, శేషవాహన, సేవ, ధ్వజారోహనము, దేవతో ద్వాసనము, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశరాధనలు, శ్రీ పుష్యరాగము, బ్రహత్సవములు పరి సమాప్తి,
నిత్య కల్యాణాలు జరుప బడవు : శ్రీసీతారాముల కల్యాణ బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నందున ఏప్రిల్‌ 13 ‌నుండి 27వ తేదివరకు నిత్యకల్యాణాలు నిలిపివేస్తున్నట్లు వైధిక కమిటి తెలిపింది.
ఏప్రిల్‌ 21‌న శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం : ఏప్రిల్‌ 21‌వ తేదీన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించిన అనంతరం సాయంత్రం శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం కానుంది. శ్రీరామ భక్తులు దీక్షా వస్త్రాలు ధరించనున్నారు. మే 17 వ తేది సోమవారం నాడు పునర్వసు దీక్ష విరమణ చేయనున్నారు. మే 17 వ తేది దీక్షా విరమణ అనంతరం రథోత్సవం నిర్వహించనున్నారు.

Leave a Reply