
అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ స్వామివారు భక్తులకు నరసింహావతారంలో దర్శనమిచ్చారు. రామలయం నుంచి స్వామివారిని కూర్మావతారం రూపునిగా తీర్చిదిద్ది పల్లకి ద్వారా కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు తీసుకొచ్చారు. మేళ తాళాలు, భక్త జన సందోహం నడుమ స్వామివారు పల్లకీలో వేంచేస్తుంటే భక్తులు చూసి తరించారు. స్వామివారి పల్లకీ ముందు భక్త భజన బృంధాలు కోలాటాలు చేస్తూ జయ రామ జయ రామ జయజయ రామా అంటూ కీర్తనలు ఆలపిస్తూ అందుకు తగ్గట్లుగా నృత్యాలు చేశారు. ప్రత్యేక వేదికపై ఆసీనులైన స్వామివారిని కొలిచేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీమహావిష్ణువు ధరించిన అవతారా)లో నాల్గవ అవతారం నరసింహావతారం. తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుని అనేక బాదలకు గురిచేస్తున్న హిరణ్యకశివుడు అనే రాక్షసుని సంహరించడానికై నారాయణుడు నరసింహవ తారాన్ని ధరించాడు. ఈ అవతారము నిడివి స్వల్పకాలికమైనా…భగవానుని సర్వవ్యాపకతను తెలియచేస్తుంది. భూతగ్రహ బాధలు,కుజగ్రహ భాదలు ఉన్నవారు ఈ అవతారాన్ని పూజించటం వలన వాటి నుండి విముక్తిని పొందుతారు. అలరించిన కోలాట నృత్యాలు – మత్య్సావతారంలో ఉన్న స్వామి పల్లకీలో తిరువీధి సేవకు బయలు దేరుతుండగా ముందు భాగంలో భజన బృంధం మహిళలు కోలా• ప్రదర్శన చేశారు. తిరువీధి సేవలు పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు స్వామివారి ప్రసాదాలు అందిం చారు. తిరువీధి సేవలో భక్తులు స్వామికి మంగళనీరా•నాలు పట్టారు.
నేడు ‘‘వామనావతారం’’ : శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 27 వ తేదీ నుండి 4వ తేది వరకు భక్తులకు వివిధ అలంకారాలలో దర్శనమివ్వ నున్నారు.ఇందులో భాగంగానే మంగళవారం నాడు స్వామివారు ‘‘ వామనావతారము’’లో భక్తులకు దర్శమిస్తారు.
విశిష్టత : దేవత సర్వసంపదను తన స్వాదీనం చేసుకున్న రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి శ్రీహరి వామన రూపంలో వెళ్ళి మూడు అడుగుల దానంగా స్వీకరించి, ఒక అడుగుతో భూమిని ,రెండవ అడుగుతో ఆకాశాన్ని , మూడవ అడుగుతో త్రివిక్రముడై బలి తలపై మోపాడు. ఈ అవతారాన్ని దర్శించటం వలన గురుగ్రహ బాధలు తొలగుతాయి.