Take a fresh look at your lifestyle.

అలుపెరగని సామాజిక విప్లవకారుడు…

“గ్నివేశ్‌ ‌తన ఆధ్యాత్మిక విశ్వాసాలల్లోనే వైదిక సామ్యవాదాన్ని కాంక్షించినాడు.ఆధ్యాత్మికత అంటే మానవ హక్కులు ప్రతిబింబేచాలా ఉండాలని ఆచరించి వెలిబుచ్చారు.సంపద సృష్ఠికర్తైన లక్ష్మీ మరియు చదువుల తల్లి సరస్వతి నిలయమైన ఈ దేశంలోనే అత్యంత పేదరికం, నిరక్షరాస్యత లు విలయతాండవం చేస్తున్నాయని,ప్రపంచంలో అత్యదిక దేవాలయాలు,పవిత్ర ప్రదేశాలు వున్న ఈ దేశంలోనే సంఘ విద్రోహులు ఉన్నారని ఆవేదన చెందేవారు.పౌష్ఠికాహారం అందని ఆనాధలు ఒకవైపు ఉంటే వారికి అందాల్సిన పాలను అభిషేకాల పేరుతో నేలపాలు చేయడాన్ని, వారికి అందాల్సిన నెయ్యి ని అగ్నిపాలు చేయడాన్ని తీవ్రంగా నిరసించారు.”

సెప్టెంబర్‌ 11 ‌న స్వామి అగ్నివేశ్‌ ‌ప్రధమ వర్థంతి

తెలంగాణ నేల ప్రజల అధికారం కోసం కోట్లాడి అమరవీరుల రక్తంతో తడిసిపోయిందని,ఈ పవిత్రమైన నేలను నుదుటి కి అద్దుకొని మాట్లాడం గర్వంగా ఉంధని మాట్లాడి న ‘‘అలుపెరగని హక్కుల పతాక’’ అగ్నివేశ్‌ ‌మనకు దూరమై అప్పుడే ఏడాది గడిచింది. వారి స్పూర్తి సకలజనుల గుండెల్లో రగులుతూనే ఉంది.వెనుకబడిన కళింగాంధ్రలో 1931 సెప్టెంబర్‌ 21‌న బ్రాహ్మణ కుటుంభం లో జన్మించిన వేప శ్యాంరావు..స్వామి అగ్నివేశ్‌ ‌గా మారి తాను పుట్టిన ప్రాంతానికే పరిమితం కాకుండా తనలో విశాలమైన భావజాలాన్ని నింపుకొని కళింగాంధ్రా నుంచి ఛత్తీస్ఘడ్‌ ‌మీదుగా అణగారిన ప్రజలతో మమేకమై యావత్‌ ‌దేశం లోని సకల ఆధిపత్యాలను నిర్భయంగా దిక్కరించినారు.భారతీయ సమాజం లో ఎక్కడ సమస్య తలెత్తినా అక్కడ తన వాణిని వినిపించినారు. రాజకీయాలలో క్రీయాశీలక విలువలు పెంపొందించేందుకు శాసన సభ్యుడిగా మంత్రి గా పని చేసారు.తదనంతరం ఈ ఎన్నికల రాజకీయాలకు దూరం గా ఉండిపోయారు.అనంతరం ప్రజా రాజకీయాలను భుజాన వేసుకొని నాలుగు దశాబ్దాల పాటు వెట్టి చాకిరి విముక్తి కోసం,వెట్టి కార్మికుల విడుదల కోసం వెట్టి కార్మికుల విముక్తి ప్రంట్‌ (‌బంధువా ముక్తి మొర్చా) పెట్టి తీవ్రమైన పోరాటాలు చేసి అంతర్జాతీయ(ఐక్యరాజ్యసమితి) స్థాయిలో చర్చకు తీసుకొచ్చి వెట్టి చాకిరి నిషేధ చట్టాలకు కారకుడైన ఉన్నతుడు అగ్నివేశ్‌.ఆడపిల్ల అని తెలిస్తే భ్రూణ హత్యలు చేస్తున్న కాలంలో అందుకు వ్యతిరేకంగా ఆడపిల్ల ను కాపాడుకుంధామని గొంతెత్తి నినదించాడు. సతి నిరోధక చట్టం రూపకల్పనలో క్రియాశీలక భూమిక పోషించారు.బాలల హక్కుల కోసం ,ఆదివాసీ హక్కుల కోసం,దళితుల,వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక రాష్ట్రాలలో పోరాటాలు నిర్వహించి పీడితుల పక్షాన నిలిచిన హక్కుల గొంతుక అగ్నివేశ్‌.

అగ్నివేశ్‌ ‌తన ఆధ్యాత్మిక విశ్వాసాలల్లోనే వైదిక సామ్యవాదాన్ని కాంక్షించినాడు. ఆధ్యాత్మికత అంటే మానవ హక్కులు ప్రతిబింబేచాలా ఉండాలని ఆచరించి వెలిబుచ్చారు.సంపద సృష్ఠికర్తైన లక్ష్మీ మరియు చదువుల తల్లి సరస్వతి నిలయమైన ఈ దేశంలోనే అత్యంత పేదరికం, నిరక్షరాస్యత లు విలయ తాండవం చేస్తున్నాయని, ప్రపంచంలో అత్యదిక దేవాలయాలు, పవిత్ర ప్రదేశాలు వున్న ఈ దేశంలోనే సంఘ విధ్రోహులు ఉన్నారని ఆవేదన చెందేవారు.పౌష్ఠికాహారం అందని ఆనాధలు ఒకవైపు ఉంటే వారికి అందాల్సిన పాలను అభిషేకాల పేరుతో నేలపాలు చేయడాన్ని, వారికి అందాల్సిన నెయ్యి ని అగ్నిపాలు చేయడాన్ని తీవ్రంగా నిరసించారు.ఈ కార్యచరణ కాషాయ వస్త్రాలకు నూతన నిర్వచనాన్ని అందించినాయి.హిందూ ఇజాన్ని సంస్కరించే క్రమంలో ఆయన అనుసరించిన అభ్యుదయ పంథా ను మిగతా కాషాయ దారులు అంగీకరించలేక పోయారు.తన ప్రగతిశీల ఆలోచనలతో లౌకిక వాదిగా ఈ దేశ స్వరుపాన్ని వ్యక్తీకరిస్తూ ఇతర విశ్వాసాలపట్ల గౌరవం కలిగి ఉండాలని ఆలోచనలోనే కాకుండా ఆచరణలో చూపించారు.అమరనాధ్‌ ,‌పూరి దేవాలయల విషయంలో వారు చేసిన వ్యాఖ్యానాలు స్వయం ప్రకటిత కాషాయదారులకు ఆగ్రహాని కలిగించడమేగాక వారి తలకు అనాటి హిందు మహాసభ ఇరువై లక్షల రూపాయల ఫత్వా జారీ చేసింది.ఐనా అగ్నివేశ్‌ ఎక్కడ వెనకడుగు వేయకుండా తను నమ్ముకున్న విశ్వాసాలకోసం కార్యచరణను కొనసాగించారు.ఎంఐఎం ఇస్లామ్‌ ‌మతత్వవాదం, ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ ‌హిందుత్వ వాదం ఈ దేశ శ్రేయస్సు కు ఆటంకం కలిగిస్తున్నాయనే భావనను అనేక సందర్భాలలో వెలిబుచ్చారు.హిందూమతంలోని వివక్షతలను, అసమానతలను, నానా దురాచారాలను వెలిబుచ్చినందుకు అనేక సార్లు పరివార్‌ ‌శక్తుల దాడికి గురయ్యారు.బహుశా ఈ దేశం లో అగ్నివేశ్‌ ‌పై జరిగినన్ని మతత్వ శక్తుల దాడులు మరెవ్వరి పై జరిగి ఉండకపోవచ్చు.మనిషి వారసుడిని మనిషిగా చూడాలి..కాని మతం కోణంలో కాదన్నారు.కుల రహిత సమాజం కోసం అందరు కృషి చేయాలని అందు కోసం కొన్ని మాసాల పాటు తెలంగాణలో ఉండి ప్రజలను చైతన్య వంతులు చేసేందుకు సిద్ధపడ్డారు.

తెలంగాణ ప్రజా ఉధ్యమాలతో నిరంతరం సంభాషణలను కొనసాగించిన అగ్నివేశ్‌ ‌కరీంనగర్‌ ‌గడ్డపై రైతుకూలీ సభలో ఆయన చేసిన ప్రసంగం ఎప్పటికి స్పూర్తి ని రగిలించేదే.తెలంగాణ లో జరిగిన ప్రజా ఉధ్యమాలలో ప్రతి చారిత్రక సందర్భంలోనూ ఇక్కడి మట్టి మనుషులతో గట్టిగా నిలబడ్డాడు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్న తెరాస పార్టీ నుండి మొదలు కొని , తెలంగాణ విద్యావంతుల వేదిక లాంటి పౌర సమాజ వేదిక ల పై ప్రసంగించి తెలంగాణ ఉద్యమానికి జాతీయ స్థాయిలో అండగా నిలిచారు.తెలంగాణ ప్రజల ఆకాంక్ష లను తెలంగాణ పల్లె నుండి దేశ రాజధాని డిల్లీ వరకు చాటి చెప్పారు.తెలంగాణ రాష్ట్రం సిద్ధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించాలని ,రాష్ట్ర ఏర్పాటు అనంతరం వీటిని నెరవేర్చాలని లేనియెడల ఆధిపత్యాల పై పోరాటం కొనసాగించవలిసి వస్తుంధని నిర్థేశనం చేసారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ విద్యావంతుల వేదిక ఐదవ మహాసభలలో పాల్గొన్న అగ్నివేశ్‌ ‌మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా తెలంగాణలో స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు జరిగాయని, ఇందులో తాను కూడా పాల్గొనడం గర్వంగా ఉందని గుర్తు చేసారు. ప్రస్తుత పాలకుల విధానాలను,ప్రాధాన్యత లను గమనించి ఉద్యమ ఆకాంక్షల నుంచి పక్కకు జరిగిన కేసీఆర్‌ ‌ప్రభుత్వ తీరును తీవ్రంగా స్పందించారు.. స్వరాష్ట్రం లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై స్పందించి ఫిల్మ్ ‌సిటీలు కావాలా..!లేక రైతుల ఆత్మహత్యలు ఆపడం కావాలా.! అని తెలంగాణ ప్రభుత్వం పై స్వామి అగ్నివేశ్‌ ‌ప్రశ్నలు సంధించారు. రైతు ఆత్మహత్యలపై స్పందిస్తూ ఇన్ని రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే ముఖ్యమంత్రి మౌనం దేనికి సూచిక అని ప్రశ్నించారు. అలాగే మోడీ తత్వం కూడా ఈ దేశాన్ని కి మంచిది కాదన్నారు.తెలంగాణలో ఫిల్మ్‌సిటీలు నిర్మిస్తున్న ముఖ్యమంత్రి కి ఆత్మహత్యలు కనిపించటం లేదా.! ఫిల్మ్ ‌సిటిలు నిర్మించినంత మాత్రాన రైతుల ఆత్మహత్యలు ఆగి పోతాయా అని అగ్నివేశ్‌ ‌ప్రశ్నల వర్షం కురిపించారు.అంగు ఆర్భాటాలు పక్కకు పెట్టి రైతు ఆత్మహత్య లు జరగకుండా ప్రణాళికలు రుపొందించాలని ఈ విషయంలో పౌర సమాజం సహకారాన్ని తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా తెలంగాణ లో రైతాంగ ఉధ్యమం బలోపేతమైంది.పోలిటికల్‌ ‌పవర్‌, ‌పీపుల్స్ ‌పవర్‌ ‌మధ్య సమన్వయం ఏర్పడితేనే తెలంగాణ అభివృద్ధి దిశగా పయనిస్తుందని సూత్రికరించారు. తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా తాను పాల్గొంటానని ప్రకటించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రభుత్వానికి విమర్శనాత్మక సూచనలు చేస్తూనే స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు.

అగ్నివేశ్‌ ‌తెలంగాణ ఉధ్యమానికి ఏవిధంగానైతే మద్దతుగా నిలబడ్డారో పౌర హక్కుల ఉధ్యమానికి అదే స్థాయిలో అండగా నిలిచినది యదార్థం.పౌర హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉధ్యమిస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య చర్చల ప్రతినిధి గా వ్యవహరించినారు.ఈ సందర్భంగా అనాటి హోం మంత్రి చిదంబరం తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఆజాద్‌ ‌ను ఎన్కౌంటర్‌ ‌చేయడం అగ్నివేశ్‌ ‌ను తీవ్ర సంఘర్షణకు గురి చేయడమే కాకుండా తనను పావుగా వాడుకుందని,తనే ఆజాద్‌ ‌మరణానికి కారణమైనంతగా మనోవేదన చెందారు .మావోయిస్టులైనా పోలీసులైనా తన అంతిమ లక్ష్యం పౌర హక్కల రక్షణే కాబట్టి మావోయిస్టుల చేతిలో బందిలైన పోలీసుల ను సైతం వారి తో చర్చలు జరిపి విడిపించారు.ఇది వారి పౌర హక్కుల స్పూర్తి కి నిదర్శనం.చత్తీస్ఘడ్‌ ‌లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్‌ ‌పై నిజనిర్థారణకు వెళ్లినప్పుడు, జార్కండ్‌ ‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు, మాజీ ప్రధానమంత్రి వాజ్‌ ‌పాయ్‌ అం‌త్యక్రియలకు వెళ్లినప్పుడు ఇలా అనేక సందర్భాలలో మతతత్వ శక్తుల చేతిలో అగ్నివేశ్‌ ‌దాడులకు గురయ్యారు.వాస్తవాలు మాట్లాడే అగ్నివేశ్‌ ‌పై మతతత్వ శక్తులు చేసిన తీవ్రమైన పిడిగుద్దులవల్లే అనారోగ్యానికి గురై కోలుకోలేని స్థితి కి చేరుకొని అణగారిన ప్రజల హక్కుల గొంతుక మూగబోయిందనేది చారిత్రక సత్యం.

నేడు అగ్నివేశ్‌ ‌ను స్మరించుకోవడమంటే వారు నమ్మిన విలువల కోసం తను ఎంచుకున్న సిద్దాంతం కోసం సామాజిక ఉధ్యమాలలో క్రీయాశీలకంగా పనిచేసి వారి ఆశయాలను ఆకాంక్ష లను ముంధుకు తీసుకుపోవడమే. అగ్నివేశ్‌ ‌నిరంతర ఉధ్యమకారుడు. ఆధిపత్యాన్ని ఎదిరించాలంటే వ్యక్తి తన అహాన్ని తగ్గించుకోవాలని సూచించి అందుకు నిదర్శనంగా నిలబడినవారు అగ్నివేశ్‌.‌సమాజహితం కోసం విలువలే ప్రామాణికంగా అగ్నివేశ్‌ ‌కొనసాగించిన ప్రజాస్వామిక సంస్కృతి ని,వారి ఆచరణాత్మకమైన జీవితం ను స్పూర్తిగా తీసుకొని ముంధుకు పోవాల్సిన బాధ్యత తెలంగాణ విద్యావంతుల వేదిక లాంటి పౌర వేదికల పై ఉంధని..అదే వారి ఆలోచనల ఆచరణ మార్గం అని టివివి విశ్వసిస్తుంది.

– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

Leave a Reply