Take a fresh look at your lifestyle.

“స్వధర్మో పరమో ధర్మః”

కొత్త దశకం వస్తూ వస్తూ మనకు సరికొత్త జీవన పాఠాలను కూడా నేర్పింది.ఇందులో ముఖ్యంగా మానవుడు తెలుసుకోవలసిన అంశం…
“మనం ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని సర్వకాల సర్వావస్థల యందు క్షేమంగా కాపాడుతుంది” మనం స్వార్థంతో తల పొగరుతో మేధావిని,సైన్సు చదివాను అనుకుంటూ ప్రకృతిని ఇష్టం వచ్చినట్లు చిన్నాభిన్నం చేస్తూ..తోటి మానవుల పట్లనే కాదు కనీసం పశుపక్ష్యాదుల పట్ల,చెట్టు చేమ పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ..వాటిని అన్నిటినీ మన స్వార్థం కోసం వాడుకుని అంతరిక్షంలో కాపురం పెడతానంటే..ప్రకృతి చూస్తూ ఉరుకోదు. ఈ కొరొనా కానీ మరింకేదైనా కానీ మనిషిని ఇంతగా భయపెడుతోంది అంటే కారణం ప్రకృతి ఆక్రోశం అది.మొత్తం మానవ జీవనాన్నే స్తంభింపజేసేసింది. అందుకే “జీవించు జీవించనివ్వు” అనే సూత్రాన్ని మళ్ళీ నెమరేసుకోవాలి మానవుడు! అంతేకాదు.. ప్రపంచం యావత్తూ కోవిడ్ తో గడగడ లాడినప్పుడు కూడా గుండెల మీద హాయిగా చేతులుంచుకుని నిద్రించగలిగింది భారతీయుడు ఒక్కడే.అందుకే సంపాదన కోసం సుదీర తీరాలను చేరిన వాళ్లేందరో కూడా ప్రాణలు దాచుకుందుకు మళ్ళీ భారతదేశానికే తిరిగి వచ్చారు.ఎంతో టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కోవిడ్ భారత్ కు వస్తే.. అంతే అంటూ.. సెటైర్లు కూడా వేశాయి.

అన్నిటినీ అధిగమించి ప్రపంచదేశాలకు తానే దిక్కై నిలిచింది ఈనాడు మన దేశం! దీనికి ప్రధాన కారణం.. మన ఘన సంస్కృతి సాంప్రదాయాలే ! అందుకే “స్వధర్మాని ధనం శ్రేయః..పర ధర్మో భయావహః ” అన్నారు.ఇకనైనా విదేశీ వ్యామోహం వీడి మన ఆచారాలు సంప్రదాయాలను వెర్రి ముఖాలతో ప్రశ్నించకుండా పెద్దల బాటను అనుసరిస్తే.. ఇలాంటి ఉపద్రవాలు ఎన్ని వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు..పైగా మన సహాయం కొరకు అర్రులు చాస్తూ..ఎదురు చూస్తాయి!. నేర్చిన గుణ పాఠాలను నిత్య పఠనాలు గా మలుచుకుని ఇంతటి బుద్ధిని నేర్పిన 2020కి ధన్యవాదాలు తెలుపుతూ.. రాబోయే 2021కి వినమ్రంగా స్వాగతం పలుకుదాం! బాధ్యత కల పౌరులుగా జీవిద్దాం…!
డా.స్రవంతి ఐతరాజు

Leave a Reply