Take a fresh look at your lifestyle.

స్వఛ్చ భారత్‌ ‌మిషన్‌ ‌గ్రామీణ SBM-G)… మహిళా సాధికారత లక్ష్య సాకారానికి అందిన ప్రోత్సాహం

‘‘మహిళల పరిస్థితి మెరుగుపడకపోతే లోక కల్యాణానికి అవకాశం లేదు.’’ – స్వామి వివేకానంద.
‘‘‌మిషన్‌ ‌మహిళల సాధికారతను ప్రోత్సహించింది – మహిళల భద్రతను మెరుగుపరచడం, వారి గౌరవాన్ని పునరుద్ధరించడం, పారిశుద్ధ్య సమస్యలపై వారికి అవగాహన కల్పించడం, పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో వారి జీవనోపాధిని మెరుగుపరచడం. అలాగే, ఇది తమపై నమ్మకం పెంచి, ఏ పరిస్థితిలోనైనా విజయం సాధించగల వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించింది.’’

2014లో భారత ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ ‌మిషన్‌ ‌గ్రామీణ్‌ ‌ప్రచారం ప్రాథమిక లక్ష్యం దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చడం, సమాజ ఆరోగ్యానికి తప్పనిసరిగా అమలు చేయాల్సిన పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ సమస్యలను పరిష్కరించడం ద్వారా కంటి ముందుకు పరిశుభ్రతను పరచడం. గ్రామీణ వర్గాల వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదం అవుతుంది. ప్రచారం ఆ తరహాలో అన్ని అంచనాలను మించి విజయం సాధించడం తో పాటువివిధ సమాజ విభాగాల మధ్య పౌర భావాన్ని పెంపొందించడానికి, పౌరుల దైనందిన ప్రవర్తనలో సానుకూల మార్పును తీసుకురావడానికి దోహదపడింది. పధకం అమలులో నూతన ఆవిష్కరణలు నైపుణ్యం కలిగిన యువ నిపుణుల వర్గాన్ని సృష్టించడం – వారిని మార్పుకు బలమైన ఏజెంట్లుగా, జన-గొంతుకలుగా మార్చడం. ముఖ్యంగా, మిషన్‌ ‌మహిళల సాధికారతను ప్రోత్సహించింది – మహిళల భద్రతను మెరుగుపరచడం, వారి గౌరవాన్ని పునరుద్ధరించడం, పారిశుద్ధ్య సమస్యలపై వారికి అవగాహన కల్పించడం, పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో వారి జీవనోపాధిని మెరుగుపరచడం. అలాగే, ఇది తమపై నమ్మకం పెంచి, ఏ పరిస్థితిలోనైనా విజయం సాధించగల వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించింది.

ఇది ప్రచారం అంతటా కనిపించింది, ఇక్కడ మహిళలు ముందు నుండి నాయకత్వం వహించారు, ప్రవర్తన మార్పును ప్రోత్సహించడానికి సమాచారం, విద్య, భావ ప్రసారం, (ఇన్ఫర్మేషన్‌, ఎడ్యుకేషన్‌, ‌కమ్యూనికేషన్‌ -×‌జు•) లలో పాల్గొనడం, రాణి మేస్త్రీలుగా మరుగుదొడ్ల నిర్మాణంలో పాల్గొనడం, వారి కుటుంబాలకు మరుగుదొడ్లు డిమాండ్‌ ‌చేయడంలో ధైర్యాన్ని ప్రదర్శించడంబీ గృహ వ్యర్థాల సేకరణ, విభజనలో చురుకుగా పాల్గొనడంబీ, అవసరమైన ప్రతిచోటా వ్యవస్థాపకులుగా కొత్త పాత్రలను చేపట్టడం, వారి కుటుంబాల ఆదాయాన్ని భర్తీ చేయడం, వారి గ్రామాలకు పురోగతిని తీసుకురావడం. ఇందులో మహిళలకు అవగాహన కల్పించడంలో సమిష్టి నిర్ణయాలను ప్రోత్సహించడంలో, మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక బృందాల ప్రముఖ పాత్ర. మహిళల విశ్వాసం, సామర్థ్యాలను ఎక్కువగా నొక్కిచెప్పనవసరం లేదు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 8 మార్చి 2022 ఇతివృత్తం ‘సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం’. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ‘స్వచ్ఛ్ ‌భారత్‌ ‌మిషన్‌- ‌గ్రామీణ్‌’ ‌స్ఫూర్తిగా జీవితం కొనసాగిస్తున్న ధైర్యవంతులైన మహిళలకు, ప్రధాన పాత్రలకు నేను సెల్యూట్‌ ‌చేస్తున్నాను. సాధికారత, లింగ సమానత్వం వారి కుటుంబాలు, వారి సంఘాలు, దేశానికి ప్రయోజనం చేకూరుస్తుందని నేను నమ్ముతున్నాను.

‘స్వచ్ఛ్ ‌భారత్‌ ‌మిషన్‌- ‌గ్రామీణ్‌’ ‌స్ఫూర్తిగా ఋతుక్రమ పరిశుభ్రత నిర్వహణ :
ఋతుక్రమ పరిశుభ్రత నిర్వహణ అనేది దీవీ-+లో ఒక ముఖ్యమైన విషయం. ఋతుస్రావం అనేది సహజమైన జీవన ప్రక్రియ అయినప్పటికీ, ఇది పునరుత్పత్తి వయస్సులో (12 నుండి 49 సంవత్సరాల వరకు) ప్రపంచ జనాభాలో సగం మందిని ప్రభావితం చేస్తుంది, ఇది కొన్నిసార్లు ఇబ్బంది, అవమానాలకి కారణం, ఋతు అశుద్ధత అనేది లోతైన కళంకంగా అనిపించడం తో పాటు లింగ సమానత్వానికి అడ్డంకిని సృష్టిస్తుంది. .భారతదేశంలో, ప్రతి సంవత్సరం భయం కరమైన సంఖ్యలో బాలికలు ఋతుస్రావం ప్రారం భమైనప్పుడు, సరిగాలేని ఋతు పరిశుభ్రత కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొం టున్నారు. ఇంకా, కుటుంబాల్లో తరతరాలుగా పాటించే ప్రాచీన పద్ధతులు, సాధారణ పనుల్లో బాలికలు పాల్గొనకుండా నిషేధిస్తాయి. శానిటరీ న్యాప్‌కిన్‌లు అందుబాటులో లేనప్పుడు, బాలికలు, మహిళలు తిరిగి ఉపయోగించిన వస్త్రాన్ని ఉపయోగిస్తారు, వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే మరింత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మహిళలు ఎదుర్కొనే ఇటువంటి సవాళ్ల నేపథ్యంలో, ఋతుక్రమ పరిశుభ్రత నిర్వహణ (వీ•వీ) కేవలం పారిశుద్ధ్యానికి సంబంధించినది కాదనే వాస్తవాన్ని మనం మేల్కొనవలసిన సమయం ఇది. లింగ-సమతుల్య ప్రపంచాన్ని సాధించే దిశగా మహిళల గౌరవాన్ని కాపాడుతూ, వారి కలలను సాకారం చేసుకునేందుకు వారికి అవకాశాలను అందించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు.

కౌమారదశలో ఉన్న బాలికలు, మహిళలందరికీ మద్దతు ఇవ్వడానికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ‌డ్రింకింగ్‌ ‌వాటర్‌ అం‌డ్‌ ‌శానిటేషన్‌ (‌ణణఔ•) జారీ చేసిన మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనలు, ఇంజనీర్లు, లైన్‌ ‌డిపార్ట్‌మెంట్‌ల లోని సాంకేతిక నిపుణులు ఏమి చేయాలో వివరిస్తాయిబీ అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు – గృహాలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ అవసరాన్ని నొక్కి చెప్పాలి, ఇది ఋతు పరిశుభ్రతలో అంతర్భాగమైనది, సురక్షితమైన ఋతు పరిశుభ్రత పద్ధతులను ప్రోత్సహించాలి. నైపుణ్యం అభివృద్ధి వంటి విషయ పరిజ్ఞానంతో పాటు పాఠశాలలు, పబ్లిక్‌ ‌టాయిలెట్లలో శానిటరీ న్యాప్‌కిన్‌ ‌డిస్పెన్సర్‌లు, భస్మీకరణయంత్రాలను ఏర్పాటు చేయాలని కోరింది. అంతేకాకుండా, ఈ కార్యక్రమం ఇతర ప్రభుత్వ పథకాలలో విలీనం చేయవలసిన వీ•వీ ప్రోగ్రామ్‌ ‌ముఖ్యమైన అంశాలను అమలు అయ్యేట్టు చేస్తుంది. ఇందులో – జ్ఞానం, సమాచారం అందుబాటులో ఉంటాయిబీ సురక్షితమైన ఋతు శోషకాల వాడకంబీ నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత మౌలిక సదుపాయాలు, ఉపయోగించిన రుతు శోషకాలను సురక్షితంగా పారవేయడం వంటి వివరణలు ఉంటాయి. ఇది యుక్తవయస్సులో ఉన్న బాలికలు, స్త్రీలకు గౌరవాన్ని కలిగిస్తుందిబీ, కౌమారదశలో ఉన్న బాలికలు ఋతుస్రావం సమయంలో పాఠశాలలో ఉండగల సామర్థ్యం, వెసులుబాటు కలుగుతుంది.

వాడి పారేసే శానిటరీ న్యాప్‌కిన్‌లలో ఉపయోగించే ప్లాస్టిక్‌ ‌బయో-డిగ్రేడబుల్‌ ‌కానందున శానిటరీ వ్యర్థాలను పారవేయడం ఒక సవాలుగా మిగిలిపోయింది, ఇది ఆరోగ్య, పర్యావరణ ప్రమాదాలకు దారితీస్తుంది. ఘన చెత్త నిర్మూలన వ్యూహంలో భాగంగా, పర్యావరణాన్ని పరిరక్షించడానికి రాష్ట్రాలు అటువంటి వ్యర్థాలను సేకరించడం, పారవేయడం, రవాణా చేయడం వంటివి నిర్వహించాలి. కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, సురక్షితమైన, సరైన వ్యర్థాల నిర్వహణ పరిష్కారాలు ఈ సమయంలో ఇంకా అవసరం. గ్రామీణ స్వచ్చ భారత మిషన్‌ ‌కింద ఋతు పరిశుభ్రత నిర్వహణపై అవగాహన, నైపుణ్యాలను పెంపొందించడానికి, సమాచారం, అవగాహన కల్గించడం, భావ ప్రసారం – ×జు• భాగం కింద నిధులు అందుబాటులో ఉన్నాయి, స్వయం సహాయక బృందాలు అటువంటి ప్రయత్నాలను ప్రచారం చేయడంలో సహాయపడతాయి. దీనికి అనుగుణంగా, రాష్ట్రాలు అపోహలను తొలగించే వివిధ కార్యక్రమాలను ప్రారంభించాయి, ఋతుస్రావం చుట్టూ ఉన్న నిషేధాలు, దాని గురించి మాట్లాడటానికి, సందేహాలను నివృత్తి చేయడానికి బాలికలు, స్త్రీలను ప్రోత్సహించడం చాల అవసరం.

ఋతుక్రమ పరిశుభ్రత నిర్వహణ కార్యక్రమాల ప్రభావం:
వివిధ రాష్ట్రాల్లోని కార్యక్రమాలను పరిశీలిస్తే, గతంలో కంటే గ్రామీణ ప్రాంతాల్లో రుతుక్రమం గురించి చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. మహిళలు, బాలికలు బహిష్టు పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారు, వాటిని అందుబాటులో ఉన్నవారు శానిటరీ ప్యాడ్లు లేదా శుభ్రమైన గుడ్డను ఉపయోగిస్తున్నారు. మూడవ రోజు వరకు స్నానం చేయడం మానేయాలని లేదా ఆలయం లేదా వంటగదిలోకి ప్రవేశించడం లేదా ఊరగాయను తాకడం వంటి పురాతన పద్ధతులను వారు ప్రశ్నిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీన్ని దేశంలోని అన్ని గృహాలు, పాఠశాలలకు విస్తరించాల్సిన అవసరం ఉంది. మహిళలు, బాలికలు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడంలో సహాయపడటానికి మరిన్ని పనులు చేయవలసి ఉంటుంది, ఇది స్త్రీలలో సమర్థవంతమైన రుతుక్రమ పరిశుభ్రతా నిర్వహణ నిర్ధారించగలదు. మహిళా సాధికారత కోసం జిల్లాలు వారి ప్రయత్నాలను వేగవంతం చేయాలని, వారికి సమాన అవకాశాలను అందించాలని, తద్వారా వారు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవచ్చని నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.

 

vini mahajan

Leave a Reply