Take a fresh look at your lifestyle.

కోల్‌బెల్ట్ ఏరియాలో సికాస కార్యకలాపాలపై నిఘా

గురజాల రవీందర్‌ ఇచ్చిన సమాచారం మేరకే వారణాసి సుబ్రహ్మణ్యం అరెస్టు: డిసిపి ఉదయ్‌ ‌కుమార్‌ రెడ్డి
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌కోల్‌బెల్ట్ ఏరియాలో ఇటీవలి కాలంలో బాగా పెరిగిన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) పెరిగిన కార్యకలాపాలపై పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. ఈ కార్యకలాపాలను నిరోధించడానికి గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో నివసిస్తున్న గురిజాల రవీందర్‌రావుపై వచ్చిన సమాచారం మేరకు అతని ఇంటిని తనిఖీ చేయగా, ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మాజీ సిసిఎం వారణాసి సుబ్రహ్మణ్యంతో పాటు డిసిఎంగా పనిచేస్తున్న అతని భార్య విజయలక్ష్మి అలియాస్‌ శ్రీ‌ధరను అరెస్టు చేసినట్లు మంచిర్యాల డిసిపి ఉదయ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, బెల్లంపల్లి ఏసిపి రహమాన్‌ ‌వెల్లడించారు.

వీరి ఇంటి నుంచి విప్లవ సాహిత్యంతో పాటు ల్యాప్‌టాప్‌, ‌మొబైల్‌ ‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు వారు సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలను మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. గురిజాల రవీందర్‌రావు ఇచ్చిన సమాచారం మేరకు వారణాసి సుబ్రహ్మణ్యం, అతని భార్య శ్రీధర 20 రోజులు అతని ఇంట్లో ఉండి తెలంగాణలోని కోల్‌బెల్ట్ ఏరియాలో సికాస కార్యకలాపాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకు రాచాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత రెండు మూడు రోజులలో రవీందర్‌రావు ఇంటికి వారణాసి సుబ్రహ్మణ్యంతో పాటు ఆయన భార్య శ్రీధరను విజయవాడ రైల్వే స్టేషన్‌ ‌సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించామన్నారు.

వీరిని విచారించగా,, మావోయిస్టు అనుబంధ సంస్థ అయిన సికాసలో 1980లో ఆదిలాబాద్‌ ‌జిల్లాలో పనిచేశాడనీ, ఆ తరువాత 2004 లో సిపిఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటులో సెంట్రల్‌ ‌కమిటీ మెంబర్‌ ‌వరకూ ఎదిగాడనీ, అనంతరం సిపిఐ మావోయిస్టు పార్టీ నార్త్ ‌రీజినల్‌ ‌బ్యూరోలో హర్యానా, పంజాబ్‌, ‌ఢిల్లీ ప్రాంతాలలో పనిచేస్తూ 2011లో బీహార్‌ ‌రాష్ట్రంలో అరెస్టయి 2019లో బెయిల్‌పై బయటికి వచ్చినట్లు వివరించారు. సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సూచలన మేరకు కోల్‌బెల్ట్ ఏరియాలో సికాస పార్టీని పునర్నిర్మాణం చేసి పూర్వ వైభవం తీసుకు రావాలన్న ఉద్దేశ్యంతో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం ప్రారంభించారనీ, అందులో భాగంగానే క్మాతన్‌పల్లిలో తన పూర్వ సహచరుడైన గురిజాల రవీందర్‌రావు ఇంటిని తన భార్యతో సహా వచ్చి కోల్‌బెల్ట్ ఏరియాలో పార్టీ పూర్వ కార్యకర్తలతో సమావేశాలు జరిపి వెళ్లిపోయారనీ, ఉత్తర భారత దేశంలో పార్టీ కార్యకలాపాలలో పాల్గొనే రవీందర్‌కి చెప్పిన మాట ప్రకారం చండీఘడ్‌ ‌నుంచి తిరిగి వస్తున్న క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్‌ ‌సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే, విజయలక్ష్మి కూడా మావోయిస్టు నేతగా కీలకంగా వ్యవహరిస్తూ తన భర్తతో కలసి పార్టీ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తన్నదనీ, ఉత్తర భారత దేశం నుంచి క్యాతన్‌పల్లికి తిరిగి వస్తున్న క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్‌ ‌సమీపంలో అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పార్టీకి చెందిన విప్లవ సాహిత్యంతో పాటు 2 ల్యాప్‌టాప్‌లు, 2 మొబైల్‌ ‌ఫోన్లు స్వాధీనం చేస్తున్నట్లు వివరించారు.

Leave a Reply