Take a fresh look at your lifestyle.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

రాష్ట్రంలో రెండుమూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడి
ఇప్పటికే వర్షాలతో ఇబ్బందిపడుతున్న తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్షగండం పొంచివుంది. మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావం వలన ఈ ప్రాంతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది.
దీనికి అనుబంధంగా 7.6 కిలోవి•టర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. రాగల 48 గంటలలో వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 3 రోజులలో ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలోనూ వర్షాలు పడొచ్చని తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply