- క్యూరేటివ్ పిటిషన్ తిరస్కరించిన ‘సుప్రీమ్’
- రాష్ట్రపతి క్షమాభిక్ష మాత్రమే మిగిలింది
- ఉరి ఏర్పాట్లలో తీహార్ జైలు అధికారులు
- ‘సుప్రీమ్’ నిర్ణయంపై నిర్భయ తల్లి హర్షాతిరేకం
సుప్రీంకోర్టులో నిర్భయ దోషులకు చుక్కెదురైంది. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు నిర్భయ దోషుల అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వినయ్, ముఖేశ్ పిటిషన్లను మంగళవారంఅత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో జనవరి 22న నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడడం ఖాయమైంది. ఇప్పటికే ఉరికిక సంబంధించి ఏర్పాట్లు జరుగుతుండగా వీరు క్యురేటివ్ పిటిషన్‌తో సుప్రీం తలుపులు తట్టారు. డెత్ వారెంట్ పై స్టే విధించి ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని వినయ్ శర్మ (26), ముఖేశ్ (32) క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని జస్టిస్ అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారీమణ్, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్ లతో కూడిన ఐదు జడ్జీల ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. క్యూరేటివ్ పిటిషన్లను విచారించేందుకు అర్హత లేని కారణంగా సుప్రీం వారిద్దరిని పిటిషన్లను తోసిపుచ్చింది. గతం నుంచి శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు ప్రయత్నిస్తున్నారనే కోణంలో వినయ్, ముఖేశ్ క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీం కొట్టివేసింది. చివరి అవకాశంగా రాష్ట్రపతి క్షమాభిక్ష ఒక్కటే మిగిలి ఉంది. ట్రయల్ కోర్టు డెత్ వారెంట్ ప్రకారం.. జనవరి 22, ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఒకవేళ వారికి క్షమాభిక్ష పెడితే ఉరిశిక్ష కాస్తా యావజ్జీవ శిక్షగా మారే అవకాశం ఉంటుంది. తమ క్యూరేటివ్ పిటిషన్లలో కూడా దోషులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ పై స్టేట్ విధించి ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరారు. చిన్న వయస్సు, వారి ఆర్థికపరంగా కుటుంబ పరిస్థితులు, రాజకీయంగా వస్తున్న ఒత్తిడులతో నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ అయింది. 2012లో నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు నిర్భయ దోషుల్లో అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా (25) అనే మిగిలిన ఇద్దరు దోషులు క్యూరేటివ్ పిటిషన్లను ఇంకా దాఖలు చేయాల్సి ఉంది. గతంలోనే ఈ నలుగురు దోషులు రివ్యూ పిటిషన్లను దాఖలు చేయగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీం తిరస్కరణతో నిర్భయ హత్యాచారం కేసులో ఉరిశిక్ష పడిన దోషులకు కోర్టు పరంగా ఇక అన్ని దారులు మూసుకుపోతున్నాయి. మరోవైపు దోషులను ఈ నెల 22న ఉదయం 7గంటలకు ఉరితీయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 7న డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోర్టు తమ క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టివేయడంతో రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంది. క్షమాభిక్షకు రాష్ట్రపతి తిరస్కరిస్తే ఇక ఉరే తరువాయి అవుతుంది. కాగా అత్యాచారంలాంటి తీవ్రమైన నేరాల్లో ఉరిశిక్ష పడిన వారికి క్షమాభిక్ష ప్రసాదించే ప్రసక్తే లేదని ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేసిన నేపథ్యంలో… నిర్భయ కేసు దోషుల వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.
నిర్భయ తల్లి హర్షాతిరేకం
నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో దోషులైన వినయ్ కుమార్ శర్మ, ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారంనాడు ఏకగ్రీవంగా తోసిపుచ్చడంపై నిర్భయ తల్లి ఆషా దేవి హర్షం వ్యక్తం చేశారు. ’ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు. ఏడేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ వచ్చాను. ఈనెల 22న దోషులను ఉరితీసే రోజు నా జీవితంలో అతి పెద్ద పండుగ రోజు అవుతుంది’ అని ఆషా దేవి అన్నారు. దీనికి ముందు, నిర్భయం హత్యాచారం కేసులో ఉరిశిక్ష పడిన వినయ్ కుమార్ శర్మ, ముఖేష్ సింగ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. దీంతో నిర్భయ కేసు దోషులకు న్యాయపరంగా అన్ని దారులూ మూసుకుపోయాయి. ఈనెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరితీయాలని ఢిల్లీ హైకోర్టు ఈనెల 7న డెత్‌వారెంట్ జారీ చేసింది.
Tags: Nirbhaya’s mother, heartbroken, Supreme Court, decision, mukesh singhal