Take a fresh look at your lifestyle.

ఢిల్లీ ఘటనలపై ‘సుప్రీమ్‌’ ‌సీరియస్‌

Supreme Serious Serious On Delhi Events

  • పోలీసుల తీరును తప్పుపట్టిన ఉన్నతన్యాయస్థానం
  •  విచారణ 23కు వాయిదా
  • 1984 ఘటనలు పునరావృతం కానివ్వమన్న ఢిల్లీ హైకోర్టు

షాహిన్‌బాగ్‌, ఈశాన్య ఢిల్లీ ఘటనలపై సుప్రీంకోర్టు విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేసింది. ఢిల్లీ హైకోర్టులో కేసు ఉన్నందున పిటిషన్‌పై విచారణకు నిరాకరించిన సుప్రీం.. హైకోర్టు విచారణను ముందుకు సాగనివ్వాలని పిటిషనర్లకు సూచించింది. ఆందోళనల్లో 20 మంది మృతి చెందడం దురదృష్టకరమన్న సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసుల తీరును తప్పుపట్టింది. ఢిల్లీ పోలీసులు సమర్ధవంతంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దేశరాజధాని ఢిల్లీలో సీఏఏ అల్లర్లపై న్యాయస్దానం బుధవారం తీవ్రంగా స్పందించింది. షహీన్‌భాగ్‌ ‌నిరసనలపై పిటిషన్లు విచారించేందుకు ప్రస్తుతం అనుకూల వాతావరణం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. నిరసనకారులతో సుప్రీంకు చెందిన ఇద్దరు మధ్యవర్తులు ఇటీవల చర్చలు చేపట్టారు. వారు ఇచ్చిన నివేదికను సుప్రీంకు సమర్పించారు. షహీన్‌భాగ్‌ ‌నిరసనల గురించి చర్చించాలంటే.. వాతావరణం నిర్మలంగా ఉండాలని జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, ‌కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. ముందుగా ప్రశాంతత ఏర్పడాలని, ప్రస్తుతం ఎన్నో పెద్ద అంశాలను పరిశీలనకు ఉన్నాయని, రెండు వర్గాలు బాధ్యతతో వ్యవహరించాలని జస్టిస్‌ ‌కౌల్‌ అన్నారు. ఢిల్లీలో జరిగిన అల్లర్ల గురించి కూడా ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. పోలీసుల్లో ప్రొఫెషనలిజం కొరువడిందని జస్టిస్‌ ‌కౌల్‌ అన్నారు. చట్టంప్రకారం పోలీసులు వ్యవహరిస్తే, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉత్పన్నం కావన్నారు. ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే, పోలీసులు ముందుకు వస్తున్నారని, లేదంటే వాళ్లలో చలనం లేకుండా పోయిందన్నారు.

ఢిల్లీ అల్లర్లపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని, దాని గురించి ఈ సమయంలో మేమే చెప్పలేమ న్నారు. ప్రజలు వినియోగించే రహదారులను.. నిరంతరం నిరసనలకు వాడకూడదన్నారు. పోలీసులు, అధికారులు ఓ వ్యవస్థ ప్రకారం పనిచేయాలన్నారు. అడ్వకేట్లు సాధనా రామచంద్రన్‌, ‌సంజయ్‌ ‌హెగ్డేలు మధ్యవర్తులుగా వెళ్లి షహీన్‌భాగ్‌ ‌నిరసనకారులతో చర్చించారు. ఇదిలావుంటే దేశంలో మరో 1984 ఘటనలను పునరావృతం కానివ్వబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈశాన్య ఢిల్లీలో ఐబీ అధికారి మృతదేహం లభ్యం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకర ఘటన అని అభివర్ణించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణమే బాధితులు, బాధిత కుటుంబాలను కలుసుకోవాలని ఆదేశించింది. బాధితులకు సాయం అందించేందుకు హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేయాలని, బాధితులను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రైవేట్‌ అం‌బులెన్స్‌లను ఏర్పాటు చేయాలని అధికారలను ఆదేశించింది. బాధితుల కోసం కనీస సదుపాయాలతో కూడిన పునరావాస షెల్టర్లను ఏర్పాటు చేయాలని కోరింది. అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంలు ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని కోర్టు ఆదేశించింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!