Take a fresh look at your lifestyle.

నిందుతుల ఫోన్‌ ‌కాల్స్ ‌డాటా ఇవ్వండి

లఖింపూర్‌ ‌ఘటన కేసులో యూపీ సర్కార్‌కు సుప్రీకోర్టు ఆదేశం

లఖింపూర్‌ ‌ఘటన కేసుపై సుప్రీమ్‌ ‌కోర్టులో సోమవారం విచారణ జరిగింది. నిందితుల ఫోన్‌ ‌కాల్స్ ‌డేటా ఇవ్వాలని యూపీ సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ పోలీసులు సేకరించిన ఆధారాలను సమర్పించాలని సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇతర కేసులకు సంబంధించిన సాక్ష్యాలను..ఈ కేసుకు ఉపయోగించకూడదని సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశించింది. సీబీఐకి విచారణ బదిలీ చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణ సుప్రీమ్‌ ‌కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

Leave a Reply